లుక్‌తోనే స్థాయి పెంచేలా..!

0
615
attempts to increase Prabhas level with the first look in saaho movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

attempts to increase Prabhas level with the first look in saaho movie
‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్‌ క్రేజ్‌ అమాంతం పెరిగి పోయింది. కాస్త జాగ్రత్తగా ప్రయత్నాలు చేసి, మంచి సినిమాలు చేస్తే బాలీవుడ్‌ స్థాయిలో ప్రభాస్‌ సినిమాలు వసూళ్లు సాధించడం ఖాయం. ఇప్పటి వరకు ఏ సౌత్‌ హీరోకు బాలీవుడ్‌లో రాని గుర్తింపు ప్రభాస్‌కు వచ్చింది. అందుకే ఆయన త్వరలో నటించబోతున్న ‘సాహో’ సినిమా కోసం చాలా జాగ్రత్తలు పడుతున్నాడు. ‘సాహో’ చిత్రంలో ప్రభాస్‌ బాలీవుడ్‌ హీరోల కనిపించే ప్రయత్నం చేయబోతున్నాడు. ఒక సౌత్‌ హీరోగా కాకుండా బాలీవుడ్‌ రేంజ్‌లో కనిపిస్తే ఫస్ట్‌లుక్‌తోనే సినిమా స్థాయి పెరిగి పోతుందని యూనిట్‌ సభ్యులు ఆశిస్తున్నారు.

ప్రభాస్‌ లుక్‌ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌ మరియు స్టైలిస్ట్‌లను ఈ సినిమా కోసం ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ప్రభాస్‌ ‘సాహో’లో కూడా తన నట విశ్వరూపం చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌ ఈ సినిమా కోసమే అమెరికాలో సిద్దం అవుతున్నాడు. వచ్చే నె నుండి ‘సాహో’ సినిమా సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. హీరోయిన్‌ ఎంపిక త్వరలోనే చేయనున్నారు. 150 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్‌ స్థాయి టెక్నీషియన్స్‌తో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు.

Leave a Reply