యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ ,కొరటాల కాంబినేషన్లో వస్తున్నజనతా గ్యారేజ్ ఆడియో ఆగస్టులో విడుదల కానుంది.ఇప్పటికే చిత్ర యూనిట్ దేవీ ఇచ్చిన ట్యూన్స్ విని తెగ సంబర పడిపోతోందంట. ముఖ్యంగా ఐటెం సాంగ్ .
ఈ రాక్ స్టార్ మ్యూతిక్ కంపోజ్ చేసే సినిమాల్లో మిగతాదంతా ఓ ఎత్తు అయితే.. ఐటెం సాంగ్ మరొక ఎత్తు అని చాలా మంది చెప్పేదే. చాలా సినిమాల్లో ఐటెం నంబర్స్ ఇరగదీశాడు డీఎస్పీ. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం కూడా ఓ అదిరిపోయే బీట్ తో ఐటెం సాంగ్ ని ఇచ్చాడని తెలుస్తోంది.
‘జనతా గ్యారేజ్’లో కొత్త తరహా సౌండ్ ట్రాక్ తో డీఎస్పీ ఇచ్చిన బీట్ చాలా బాగుందట. ఈ ట్యూన్ విన్న ఎన్టీఆర్.. దర్శకుడు కొరటాల శివ విపరీతంగా ఎగ్జైట్ అయ్యారట. తమ సినిమాలో ఈ మ్యూజిక్ కచ్చితంగా ఉండాల్సిందే అనే రేంజ్ లో డీఎస్పీ వారిని మరిపించేశాడని అంటున్నారు. అందుకే ముందుగా అనుకోకపోయినా.. తమ మూవీలో ఈ ట్రాక్ సెట్ చేస్తున్నారట. ఈ ఐటెం సాంగ్ లోనే ఆడిపాడేందుకు మిల్కీబ్యూటీ తమన్నా ఓకే చెప్పింది.
ఆగస్ట్ రెండో వారంలో ఎన్టీఆర్- తమన్నాలపై ఈ ఐటెం సాంగ్ షూట్ చేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి.. ఆగస్ట్ లో ఆడియో విడుదల చేసేలా ప్లాన్ చేశారు.