వైద్యుల కొరత..

0
649

av jaya krishnan
జాతీయ స్థాయిలో లెక్కిస్తే లక్ష జనాభాకు కేవలం 80 మంది డాక్టర్లే ఉన్నారు. వారిలో నకిలీ డాక్టర్లను తీసేస్తే ఆ సంఖ్య 80 నుంచి 36కు చేరుతుంది. హెల్త్ వర్క్ ఫోర్స్ ఇన్ ఇండియా పేరుతో రూపొందించిన అధ్యయనం వెల్లడించిన విస్మయకరమైన అంశాలను చూస్తే దేశంలో ఆరోగ్యరంగంలో సేవలు ఎంత అధ్వాన్నస్థితిలో ఉన్నాయన్న విషయం అవగతమవుతుంది.: ఇండియాలోని అలోపతి వైద్యం చేస్తున్నవారిలో సగం కంటె ఎక్కువ మంది నకిలీలే ఉన్నారు. డాక్టర్లలో దాదాపు 57 శాతం మందికి తగిన అర్హతలులేవు. వాళ్లలో 31శాతం మంది ఇంటర్ మీడియట్ వరకు మాత్రమే చదివారు.

2001నాటి జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ సంగతి తేలింది. నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య సిబ్బందిలో 18.8 శాతం మందికి మాత్రమే వైద్య అర్హతలున్నాయి. అర్హతలు లేకుండా అలోపతివైద్యం చేసినవారిని నకిలీలనే భావించవలసి వస్తుందన్నారు. నకిలీ వైద్యాన్ని అరికట్టడానికి కేంద్రం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఈ అంశంపై భారతీయ వైద్య సంఘం ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఏవీ జయకృష్ణన్ తెలిపారు.

ఎన్నో రాష్ర్టాల్లో నకిలీ వైద్యులు ఆపరేషన్లు కూడా చేస్తున్నారని, అరెస్ట్ చేసినా మరునాడే వాళ్లు బెయిల్‌పై విడుదలై మళ్లీ అదే పనిచేస్తున్నారని, చట్టాలు బలహీనంగా ఉండడమే ఇందుకు కారణమని ఆయన అన్నారు. దేశంలో వైద్యంపై 2011 జనాభా లెక్కల ప్రకారం రూపొందించిన నివేదిక కూడా త్వరలో వెల్లడి కానున్నది

Leave a Reply