నటుడిగా క్రేజ్ సంపాదించిన అవసరాల శ్రీనివాస్ ఓ పక్క దర్శకుడిగా కూడా మంచి ఇమేజ్ కొట్టేశాడు. తీసిన మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే యూత్ కు ఎక్కేయడంతో అవసరాల శ్రీనివాస్ మూవీ అంటే యూత్ అంతా ఈగర్ గా వెయిట్ చేసేలా చేసుకున్నాడు. ఇక జ్యో అచ్యుతానంద అంటూ మరోసారి తన దర్శకత్వ ప్రతిభ చూపించేందుకు వస్తున్న శ్రీని ఈ సినిమా ట్రైలర్ తోనే మరో ప్రేమదేశం కథను చూపిస్తున్నాడని అనిపించాడు. అయితే తీరా రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ చూస్తుంటే శ్రీని ఏదో మ్యాజిక్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
ట్రైలర్ లో హీరోగా నటిస్తున్న నారా రోహిత్, నాగ శౌర్యలు ఇద్దరు జ్యో అదేనండి రెజినాను పడేయాలని చూస్తారు. ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అనుకునే సమయంలో సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న సందర్భంగా మరో పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇక అందులో రోహిత్, శౌర్యలు రెజినాతో కాకుండా వేరే భామలతో క్లోజ్ గా ఉంటారు. సో ఇలా పోస్టర్స్ తో సినిమా మీద భారీ హైప్ వచ్చేలా చేస్తున్న అవసరాల శ్రీనివాస్ కొద్దిపాటి కన్ ఫ్యూజన్ కూడా ఏర్పడేలా చేస్తున్నాడు. మరి ఈ కన్ ఫ్యూజన్ క్లియర్ అవ్వాలంటే సెప్టెంబర్ 9న రిలీజ్ అవుతున్న సినిమా చూడాల్సిందే.