అవసరాల సోగ్గాడే..

0
347

Posted [relativedate]

 avasarala srinivas act soggadu movie

దర్శకుడు, నటుడిగా కూడా రాణిస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. ఇటీవలే “జ్యో అచ్చుతానంద”తో దర్శకుడిగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నాడు. తన తదుపరి చిత్రాన్ని నాని హీరోగా తెరకెక్కించేందు రెడీ అవుతున్నాడు.

అయితే, ఈలోగా అవసరాల ‘హంటర్’ రిమేక్ లో నటించనున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో హంటర్ రిమేక్ తెరకెక్కనుంది. అడల్ట్ కామెడీ తెలుగు రిమేక్ ‘సోగ్గాడు’ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ‘బాబు బాగా బిజీ’ అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది.

హంటర్’లో బోల్డ్ సన్నివేశాలతోపాటు.. ఎమోషనల్ సన్నివేశాలు సైతం ఎక్కువ పాళ్లలో ఉన్నాయి. అంతేగాక సినిమా ద్వితీయార్థం మొత్తం ఎమోషనల్‌ గానే
సాగుతుంది. అందుకే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకొన్నాడట అవసరాల. ఈ సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు అవసరాలతో రొమాన్స్ చేయనున్నారు. హీరోయిన్లుగా రెజీనా, కేథరిన్.. తదితరులు ప్రచారంలో ఉన్నారు.

Leave a Reply