ప్రీ లుక్కే చించేశారు..!

0
524
soggadu-prelook-fb

Posted [relativedate]

 Avasarala Srinivas Adult Movie Soggadu Pre Look surprised

బాలీవుడ్ అడల్ట్ బేస్డ్ ఎరోటిక్ మూవీ హంటర్.. బీ టౌన్ లో సూపర్ హిట్ అయిన ఆ సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సోగ్గాడు టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో నటుడు దర్శకుడు అవసరాల శ్రీనివాస్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. సినిమాలో హీరోయిన్స్ గా మిస్తీ చక్రవర్తి, తేజశ్వి, శ్రీముఖిలు నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకుల మైండ్ సెట్ తో పోల్చితే మనదగ్గర అలాంటి సినిమాలకు ఆదరణ తక్కువే. మరి ఏ నమ్మకంతో సోగ్గాడు రంగంలో దిగాడో తెలియదు కాని సినిమాకు సంబందించిన ప్రీ లుక్ ఒకటి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది.

పెదాలను కొరుకుతూ వదిలిన ఈ ప్రీ లుక్కే ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ తోనే అంచనాలను ఏర్పడేలా చేసింది. కాస్త డోస్ ఎక్కువైనదని అనిపించినా తెలుగు సినిమాలో ఇంతవరకు రాని హీటెక్కించే పోస్టర్ తో ప్రీ లుక్ వదిలారు. ఓ పక్క దర్శకుడిగా నటుడిగా శ్రీని అదరగొడుతూనే మరో పక్క ఇలా ప్రయోగాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. మరి ప్రీ లుక్ లో ఉన్న విషయం సినిమాలో ఉండేలా జాగ్రత్త పడతారో లేక కేవలం పోస్టర్స్ లోనే సినిమా చూపించేస్తారో చూడాలి.

Leave a Reply