Posted [relativedate]
హిందీ హంటర్ సినిమాకి తెలుగు రీమేక్ గా వస్తున్న ‘బాబు బాగా బిజీ ‘ కి ఊహించని ఇబ్బంది వచ్చింది.హీరో ఓ పెళ్ళైన ఆంటీ తో పెట్టుకున్న ఎఫైర్ ఎపిసోడ్ తో రిలీజ్ డేట్ వెనక్కెళ్లింది. ముందుగా ఈ సినిమాని ఏప్రిల్ 14 కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.కానీ సెన్సార్ దగ్గర బ్రేక్ పడింది.సెక్స్ అడిక్ట్ అయిన హీరో పెళ్లి అయిన ఓ ఆంటీ తో పెట్టుకున్న సంబంధం,దాన్ని చిత్రీకరించిన తీరు మీద సెన్సార్ బోర్డు అభ్యంతరాలు చెప్పింది.హిందీలో హంటర్ సినిమాకి కూడా ఇదే ఇబ్బంది ఎదురైంది.దీంతో వాళ్ళు రివిజన్ కమిటీ కి వెళ్లినా లాభం లేకపోయింది.ఆ సీన్స్ కొన్ని తొలగించి,అయితే కథనానికి ఇబ్బంది రాకుండా కొంత అదనపు షాట్స్ తీసి సెన్సార్ ముద్ర పడ్డాక రిలీజ్ చేసి హిట్ కొట్టారు.
తెలుగులో బాబు బాగా బిజీ కి కూడా అదే పరిస్థితి ఎదురైంది.దీంతో చిత్ర యూనిట్ కోతలు,కలపడంలో బిజీ అయ్యింది.ఆ పనుల కోసం సినిమా కాస్త లేట్ అయ్యేట్టుంది.మే 7 కి సినిమా పోస్ట్ పోన్ కానుంది.