‘బాహుబలి’ సునామిలో రొమాంటిక్‌ బాబు పడవ ప్రయాణం!!

Posted April 17, 2017

avasarala srinivas 'Babu Baga Busy' is giving huge competition to Bahubali 2
దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ‘బాహుబలి 2’ చిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘బాహుబలి’కి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా విడుదలకు ముందు వారం, విడుదల తర్వాత రెండు వారాల పాటు ఏ సినిమాకు కూడా ఛాన్స్‌ దక్కదు. ‘బాహుబలి’ విడుదలైన రెండు వారాల వరకు ప్రభంజనం సృష్టించడం ఖాయం. మొదటి పార్ట్‌ రెండు వారాల పాటు మరో సినిమాకు ఛాన్స్‌ ఇవ్వలేదు. అలాగే రెండవ పార్ట్‌ కూడా రెండు వారాల పాటు సునామిలా కలెక్షన్స్‌ను రాబట్టడం ఖాయం అంటూ సినీవర్గాల వారు ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు.

‘బాహుబలి 2’ రెండు వారాల పాటు సునామి ఖాయం అని అంతా అంచనా వేస్తున్న సమయంలో కేవలం వారం గ్యాప్‌లోనే రొమాంటిక్‌ చిత్రం ‘బాబు బాగా బిజీ’ని విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. బాలీవుడ్‌ అడల్ట్‌ చిత్రం ‘హంటర్‌’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే తెలుగు యూత్‌ ఆడియన్స్‌లో అంచనాలను పెంచేసింది. పూర్తి స్థాయి అడల్ట్‌ చిత్రంగా, పచ్చి బూతు చిత్రంగా ఇది ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తుంటేనే అర్థం అవుతుంది. ఎంతగా అంచనాలున్నా కూడా ‘బాహుబలి’ విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమాను విడుదల చేయడం అనేది పెద్ద సాహసమే అని చెప్పాలి. అందుకే బాహుబలి సునామిలో రొమాంటిక్‌ బాబు సినిమా కొట్టుకు పోవడం ఖాయం అని ఇప్పటి నుండే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విడుదల సమయం వరకు బాబు నిర్మాతలు మనస్సు మార్చుకుంటారేమో చూడాలి.

SHARE