వెంకీతో అవసరాల !….

Posted October 4, 2016

  avasarala srinivas directed chance venkatesh

‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’ చిత్రంతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్.మొదటి చిత్రమే అవసరాలకి హిట్ అవసరం తీర్చింది. అయితే, తొలి చిత్రంలో దర్శకుడి కంటే అవసరాలలోని రచయితకే ఎక్కువ మార్కులు దక్కాయి. ఇక, ఈ మధ్యే  ప్రేక్షకుల ముందుకొచ్చిన అవసరాల రెండో ‘జ్యో అచ్యుతానంద’తో
దర్శకుడిగా కూడా హిట్ కొట్టాడు అవసరాల. స్క్రిన్ ప్లేతో మాయ చేశాడు. అదిరిపోయే హిట్ ని ఖాతాలో వేసుకొన్నాడు. రెండో విఘ్నాన్ని విజయవంతంగా
దాటేశాడు.

ఇప్పుడు అందరికీ అవసరాల శ్రీనివాస్ అవసరమొచ్చింది. ఈ మధ్య అవసరాలకి నిర్మాత అల్లు అరవింద్ నుంచి కాల్ వచ్చిందనే వార్తలొచ్చాయి. కుదిరితే
నిహారిక లేకపోతే అల్లు శిరీష్ కోసం ఓ కథని రెడీ చేయమని అరవింద్ అడిగారట. తాజాగా, విక్టరీ వెంకటేష్ కి కూడా అవసరాల అవసరమొచ్చిందని టాలీవుడ్ టాక్. విక్ట‌రీ వెంక‌టేష్‌తో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా ప్లాన్ చేయాల‌ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సూర్యదేవర నాగవంశీ భావిస్తున్నాడ‌ట‌. ఇదే నిజమైతే.. త్వరలోనే అవసరాల-వెంకీ కలయికలో అచ్చ తెలుగు సినిమా రావడం ఖాయం.

ప్రస్తుతం ‘హంట‌ర్’ రిమేక్ లో బిజీగా ఉన్నాడు అవసరాల. ఇది పూర్తైన త‌రువాత హీరో నానితో ఓ సినిమా చేయనున్నాడు. నాని చిత్రం తర్వాత వెంకీ సినిమాకి పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి.

SHARE