అవసరాల అవసరముంది ..

  avasarala srinivas got so many movie offers director
జ్యో అచ్యుతానంద …సినిమా చూశాక తెలుగు సినీ రంగానికి దర్శకుడి గా అవసరాల శ్రీనివాస్ అవసరం ఎంతో ఉందని అర్ధమైంది . ఊహలు గుసగుసలాడే తో మొదటి సినిమాలోనే తనదైన బ్రాండ్ వేసిన అవసరాల తాను వన్ టైం వండర్ కాదని రెండో సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు.సున్నితమైన కధని..అంతకన్నా సున్నితంగా తెరకెక్కించడంలో అవసరాల సక్సెస్ అయ్యాడు.ఆధునాతన జీవన శైలిని ప్రతిభింబిస్తూనే తెలుగుదనాన్ని కధలో భాగం చేయడం చూస్తే ..ఈ కుర్రోడు అమెరికాలో పెరిగొచ్చాడంటే నమ్మబుద్ధి కావడం లేదు .

దృశ్యంమనోహరంగా చూపించడంతో పాటు ..మాట కూడా పదునుగా వాడటంలోతనకు తానే సాటి అనిపించుకున్నాడు.మనసులో భావం బయటపడకుండా మాట పనికొస్తుందన్న అర్ధంలో అతను రాసిన మాట సినిమాకే హైలైట్.బాపు ,జంధ్యాల ,ముళ్ళపూడి వంటి మహామహులు వెళ్ళిపోయాక అలాంటి సినిమాలు ఎవరు తీస్తారా అని ఎదురు చూసేవారికి ..ఇక ఆ పని లేదనిపించింది .అవసరాలని వారితో పోల్చడం కాదు గానీ ఈ తరం లో అలాంటి భావుకత వున్నదర్శకుడు వున్నారని మాత్రం నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు . అతనే అవసరాల .అతనికి సినిమా అవసరమేమో గానీ తెలుగు సినిమాకి ఆయన అవసరముంది .అలాంటి ఆణిముత్యాన్ని అవకాశమిచ్చిన సాయి కొర్రపాటి ని అభినందించాల్సిందే .

SHARE