అవసరాల ఆత్మశోధన ..

 avasarala srinivas self satisfaction
సహజంగా ఒక్క సినిమా హిట్ అయితే చాలు అన్నీ తెలిసినట్టు ఫీల్ అయిపోయే దర్శకులకి అవసరాల శ్రీనివాస్ భిన్నం.ఒకటి కాదు రెండు సినిమాలు వరసగా హిట్స్ ..అది కూడా తెలుగుదనం ఉట్టిపడే కధలు ..మెదడుకు పని పెట్టే మాటలు…గుండెను తడిమే సన్నివేశాలు..వీటిసాయంతో టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తున్న అవసరాలని కదిలిస్తే ఆ నోటి వెంట సొంత గొప్పలు రావు.చేసిన తప్పులు ..ఇంకా బాగా చేసి ఉండొచ్చన్న కళాతృష్ణ కనిపిస్తాయి.

తాజాగా అవసరాల జ్యోఅచ్యుతానంద తో సూపర్ హిట్ కొట్టాడు.కానీ ఆ సినిమా ప్రమోషన్ కి వస్తున్న అవసరాల స్క్రిప్ట్ దశలో నమ్మకంగా ఉన్నప్పటికీ షూటింగ్ టైములో విశ్వాసం తగ్గి టెన్షన్ పడ్డట్టు ఓపెన్ గా చెప్పుకున్నాడు.ఇక తొలి సినిమా ఊహలుగుసగుసలాడే క్లైమాక్స్ ఇంకా బాగా చేయాల్సిందని నిర్మాత సాయి కొర్రపాటి అభిప్రాయపడిన విషయాన్ని ఓపెన్ గా చెప్పాడు.సినిమా హిట్ కాగానే ఏది చెప్పి అయినా హీరోల్ని ఒప్పించవచ్చు.కానీ రెండు హిట్ ల తరువాత తీయబోయే సినిమా కధ మార్చబోతున్నట్టు కూడా అవసరాల వివరించాడు.అందుకు తాను చెప్పిన కారణం ఏంటో తెలుసా…

జెంటిల్ మ్యాన్ షూటింగ్ టైం లో నానికి కథ చెప్పాడంట అవసరాల.నానికి నచ్చి ఓకే అన్నాడంట.జెంటిల్ మ్యాన్ చూశాక తాను చెప్పిన కథ అంత ఎక్సయిటింగ్ గా లేదని కథ మార్చబోతున్నాడట.సక్సెస్ లో ఉండి కూడా ఇంతగా ఆత్మశోధన చేసుకుంటున్న అవసరాల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని ఆశిద్దాం.

SHARE