ఆ మలుపు అవికాతోనేనా..!

Posted November 17, 2016

Avika Gor Important Role Nikhil EPCకుర్ర హీరో నిఖిల్ హీరోగా రేపు థియేటర్ లో సందడి చేయబోతున్న సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా. వి.ఐ.ఆనంద్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాలో హెబ్భా పటేల్, నందిత శ్వేత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలో మొత్తం ఆరుగురు హీరోయిన్స్ ఉన్నారని రివీల్ చేశారు నిఖిల్. అయితే వాళ్లెవరు అన్నది మాత్రం చెప్పలేదు. ఇక సినిమా రేపు రిలీజ్ అవుతున్న సందర్భంలో ఒక హీరోయిన్ మాత్రం అవికా గోర్ అని తెలుస్తుంది.

అంతేకాదు అవికా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందట. అసలు కథ మలుపు తిప్పే పాత్ర అవికా గోర్ దే అంటున్నారు. చివర అర్ధగంటలో వచ్చే ఈ పాత్రకు అవికా అదిరిపోయేలా చేసిందట. నిఖిల్ సినిమాలకు మునుపెన్నడూ లేని రిలీజ్ బజ్ తో వస్తున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. సినిమా ఆడియెన్స్ ను థ్రిల్ చేయడం పక్కా అని అంటున్నాడు నిఖిల్. మరి అవికా తిప్పే ఆ మలుపు నిఖిల్ కెరియర్ ను ఏ రేంజ్ కు తీసుకెళ్తుందో చూడాలి.

శంకరాభరణం సినిమా తర్వాత సంవత్సరం పాటు కష్టపడ్డ నిఖిల్ సినిమా హిట్ తో మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. రేపు రిలీజ్ అనగా ఈరోజు రిలీజ్ చేసిన టీజర్ కూడా సినిమా మీద అంచనాలను పెంచేస్తుంది. మరి నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

SHARE