ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

0
809
ayesha takia Plastic Surgery

Posted [relativedate]

ayesha takia Plastic Surgeryఈ పిక్ లో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా… కొంచెం కష్టంగా ఉంది కదూ. నాగార్జున నటించిన సూపర్ సినిమా గుర్తుంది కదూ. అందులో నాగ్ లవర్ గా నటించిన ఆయేషా టకియానే. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా తెలుగు సినీ అభిమానులను తన నటనతో, అందచందాలతో ఆకర్షించగలిగింది.  ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో  వాంటెండ్ సినిమాలో కూడా నటించింది. ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు అబు అజ్మీ కుమారుడు అనీస్ అజ్మీని వివాహం చేసుకున్న అయేషా వెండితెరకు దూరమైంది. కొడుకుని కన్న తర్వాత ఆమె పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని, అది వికటించడంతో ఆమె ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. విచిత్రం ఏంటంటే ఆమెతో నటించిన వారు, ఆమె అభిమానులు కూడా ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారట.

కాగా ప్రాణాలను పణంగా పెట్టి ఇటువంటి ప్లాస్టిక్ సర్జరీలు సెలబ్రిటీలు ఎందుకు చేయించుకుంటున్నారోనని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు. గతంలో ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతోనే పాప్ సింగర్ మైకేల్ జాక్సన్, టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చనిపోయారని విమర్శిస్తున్నారు. ఎంతో అందంగా ఉండి కుర్రాళ్లను తన మత్తులో పడేసిన ఆయేషా కూడా అదే ప్లాస్టిక్ సర్జరీతో తన అందాన్ని పోగొట్టుకోవడం బాధాకరమని అంటున్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేటప్పుడు డాక్టర్ల సలహాలను పాటించడం మంచిదని, హద్దుమీరిన ఆపరేషన్లు ఎప్పుడూ డేంజరేనని సూచిస్తున్నారు. ఏది ఏమైనా అయేషాకి మునపటి అందం తిరిగిరాదని తెలుసుకున్న ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply