వైసీపీ ఆరోపణలకు ఆ మంత్రి ఊతం?

Posted April 18, 2017

ayyanna patrudu says tdp bjp and jana sena going to participate together in 2019 elections
టీడీపీ,బీజేపీ,జనసేన కాంబినేషన్ లో 2019 ఎన్నికలు జరుగుతాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ వైఖరి చూసిన వారు ఎవరికీ ఈ నమ్మకం కలగదు.ఇంకా కొంతమంది అయితే మరో అడుగు ముందుకెళ్లి అసలు టీడీపీ,బీజేపీ మధ్యే పొత్తు ఉంటుందో లేదో అంటున్నారు. కానీ ఓ మంత్రిగారు మాత్రం వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ,బీజేపీ,జనసేన కలిసే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎదుర్కొంటాయని అంటున్నారు.ఆయనే అయ్యన్న పాత్రుడు. ఆయన ఈ మాట చెప్పగానే ఆశ్చర్యపోవడం విలేకరుల వంతు అయింది. ఇదెలా సాధ్యం అని ఆయన్ని అడిగితే అయ్యన్న “కావాలంటే ఓ కాగితం మీద రాసి పెట్టుకోండి.అప్పుడు ఏమి జరుగుతుందో చూడండి” అని జవాబు ఇచ్చారు.మంత్రి గారి వ్యాఖ్యలతో వైసీపీ సంబరపడుతోంది.ఎందుకంటే..

ప్రతిపక్ష పాత్రలో జనాల్లోకి వెళుతున్న పవన్ కళ్యాణ్ ని కంట్రోల్ చేయడానికి వైసీపీ పదేపదే చేసే ఓ ఆరోపణ చేస్తుంది.జనసేన అనేది టీడీపీ …ముఖ్యంగా చంద్రబాబు చెప్పుచేతల్లో నడుస్తుందని వైసీపీ ఆరోపిస్తూనే వుంది.అయితే ఆ ఆరోపణల్ని జనసేన,టీడీపీ ఖండిస్తూ వస్తున్నాయి.కానీ ఇప్పుడు అయ్యన్న వ్యాఖ్యలతో ఆ ఆరోపణలకు బలం చేకూరినట్టైంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్ లో అయ్యన్న కామెంట్స్ వైసీపీ కి అవకాశంగా మారొచ్చు.ఇలాంటి విషయాల్లో కామెంట్ చేసేటప్పుడు తమకు భవిష్యత్ పరిణామాలు తెలుస్తాయని చెప్పేందుకు ప్రాధాన్యం ఇవ్వడం కన్నా పార్టీ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడితే మంచిది. ఈ విషయంలో సీనియర్ నేతలకు ఎవరైనా ప్రత్యేకంగా చెప్పాలా?

SHARE