ఆ జనాన్ని ప్రేమించండి ..మోడీకి ఆజాద్ హితవు

  azad said modi love that people
క‌శ్మీర్ అంశంపై ప్ర‌ధాని మోదీ ల‌క్ష్యంగా కాంగ్రెస్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించింది. ఇంత కీల‌క‌మైన అంశంపై పార్లమెంట్‌లో చ‌ర్చ జ‌రుగుతుంటే ప్ర‌ధాని లేక‌పోవ‌డాన్ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత ఆజాద్ ప్ర‌శ్నించారు కాశ్మీర్‌ అంశంపై ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత ఆజాద్. గత 33 రోజులుగా కాశ్మీర్‌లో కర్ఫ్యూ కొనసాగుతుందని, ఇలాంటి విషయంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రధాని సభలో మాట్లాడాల్సిందేనని పట్టుబట్టారు. కాశ్మీర్‌ లోయను ప్రేమిస్తే సరిపోదని.. అక్కడి ప్రజలను ప్రేమించాలన్నారు. కాశ్మీర్‌ అంశంపై ప్రధాని మోడీ మధ్యప్రదేశ్‌లో మాట్లాడారు.

అలాగే దళితుల అంశంపై తెలంగాణలో మాట్లాడారు. కానీ పార్లమెంట్‌లో మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని ఈ విషయాలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని డిమాండ్ చేశారు ఆజాద్.మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ర్యాలీలో క‌శ్మీర్ అంశంపై మాట్లాడుతారుగానీ.. పార్ల‌మెంట్ చ‌ర్చ‌లో ఎందుకు పాల్గొన‌ర‌ని ఆయ‌న నిల‌దీశారు. పార్ల‌మెంట్ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు ఎప్పుడు మారిందో తెలియ‌దు.. మోదీ ప్ర‌క‌ట‌న పార్ల‌మెంట్ నుంచి రావాలి.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి కాదు అని ఆజాద్ అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక్క‌టే ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేద‌ని, అన్ని పార్టీలు కలిసి ప‌రిష్కారం ఆలోచించాల‌ని ఆయ‌న సూచించారు.

క‌శ్మీర్ స‌మ‌స్య‌పై తాము ఏ ఒక్క‌రినీ నిందించ‌డం లేద‌ని, అయితే అది సాధార‌ణ శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య కాద‌ని ఆజాద్ అభిప్రాయ‌ప‌డ్డారు. బుర్హాన్ వాని హ‌త్య త‌ర్వాత క‌శ్మీర్‌లో ఏర్ప‌డిన క‌ల్లోల ప‌రిస్థితుల‌పై ప్ర‌ధాని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ర్యాలీలో స్పందించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం పెచ్చుమీరిపోయిందని దాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయాల్సిన తరుణంఆసన్నమైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. కశ్మీర్ వ్యవహారంపై అందరూ ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన గుర్తుచేశారు.

కశ్మీర్‌పై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. పార్టీ విబేధాలను విడనాడి కశ్మీర్ అంశాన్ని పరిష్కరించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరోపక్క పీడీపీ, బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాతే కశ్మీర్‌లో అశాంతి నెలకొందని విపక్ష నేత గులాంనబీ ఆజాద్ ఆరోపించారు. కశ్మీర్ సమస్యను అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. కశ్మీర్ వ్యవహారంపై మోదీ సభకు వచ్చి ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

SHARE