‘బాహుబలి 2’ ఆరు షోలు ఎందుకు పడటం లేదు

0
302
Baahubali 2 Six Shows Issue In Andhra Pradesh but theaters are not play six shows

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Baahubali 2 Six Shows Issue In Andhra Pradesh but theaters are not play six showsభారీ బడ్జెట్‌, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి 2’ సినిమాకు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఆ కారణంగా ఏపీ ప్రభుత్వం ‘బాహుబలి 2’ సినిమా రాష్ట్రంలో రోజుకు ఆరో షోలు ప్రదర్శించేందుకు అనుమతించింది. తెలుగు సినిమా ఖ్యాతిని దేశ వ్యాప్తంగా వ్యాప్తించేలా చేసిన జక్కన్నకు ఏపీ ఇచ్చిన గౌరవం ఇది. అయితే ఆ అవకాశాన్ని చిత్ర నిర్మాతలు వినియోగించుకోవడంలో విఫలం అవుతున్నారు. తెలంగాణలో అయిదు షోలకు ఏపీలో ఆరు షోలకు అనుమతి దక్కినా కూడా ఏపీలో ఆరు షోలు పడుతున్న దాఖలాలు కనిపించడం లేదు.

ఏపీలో అనుమతి ఉన్నప్పటికి ఎక్కువ థియేటర్లలో నాలుగు లేదా అయిదు షోలను మాత్రమే వేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నం చేసినా కూడా థియేటర్‌ యాజమాన్యం మరియు థియేటర్‌ సిబ్బంది అందుకు సహకరించడం లేదు. దాంతో చేసేది లేక డిస్ట్రిబ్యూటర్లు చేతులెత్తుస్తున్నారు. ఆరు షోలు పడటం వల్ల మరింతగా లాభాలు వచ్చేవని, కాని థియేటర్ల యాజమాన్యం ఒప్పుకోక పోవడంతో దాదాపు ఏపీలో రెండు నుండి మూడు కోట్ల వరకు మొదటి రోజు కలెక్షన్స్‌ తగ్గినట్లుగా చెబుతున్నారు. కష్టపడి ఏపీ ప్రభుత్వం నుండి అనుమతి తెచ్చుకున్నా కూడా థియేటర్ల వారు సహకరించక పోవడంతో డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాతలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply