బాబు బంగారం ప్రివ్యూ ….

140
Spread the love

  babu bangaram preview

చిత్రం : బాబు బంగారం (2016)
న‌టీన‌టులు : వెంక‌టేష్‌, న‌య‌న‌తార
సంగీతం : జిబ్రాన్‌
డైరెక్టర్ : మారుతి
నిర్మాత : సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ- పీడీవీ.ప్ర‌సాద్‌
రిలీజ్ డేట్‌ : 12 ఆగ‌స్టు, 2016

‘విక్టరీ’ ఇంటి పేరుగా మార్చుకున్న హీరో వెంకటేష్‌. వెండితెరపై వినోదం పండించడంలోనూ, కుటుంబ భావోద్వేగాలు ఆవిష్కరించడంలోనూ వెంకీది ప్రత్యేకమైన శైలి. వెంకీ ఒక సినిమాకు సైన్‌ చేశారంటే దానికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టేనని ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకం. ఆయన తాజా చిత్రం “బాబు బంగారం”. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకీ సరసన నయనతార జతకట్టనుంది. సంగీతం జిబ్రాన్‌. ఎస్‌.రాధాకృష్ణ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఫ్యామిలీ హీరో + యూత్ ఫుల్ డైరెక్టర్ కలయికలో వస్తోన్న ‘బాబు బంగారు’ కామెడీ, మాస్ ఎంటర్ టైనర్ గా రేపు శుక్రవారం (ఆగస్టు12) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యువ ప్రేక్షకుల పల్స్‌ తెలిసిన మారుతి వెంకీ సినిమాని ఎలా డీల్ చేశాడు. వెంకీ మార్క్ కామెడీ, యాక్షన్ ‘బాబు బంగారం’లో ఉన్నాయా.. ? సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ..

ప్రివ్యూ :

* వెంకీ కామెడీ బాగా చేయగలడు
* వెంకీ యాక్షన్ కూడా ఇరగదీయగలడు
* ఈ రెండింటిని ‘బాబు బంగారం’ మిస్ కాకుండా చూశాడు దర్శకుడు మారుతి
* ఫస్టాఫ్ అంతా వెంకీ కామెడీ మార్క్ చూపించేస్తాడట.
* ఇక, సెకాండాప్ బొబ్బిలి రాజా బ్యాక్.. పులి నాన్ వెజ్ లోకి దిగింది. ఇక నరకమే.
* సినిమాలో కృష్ణ (వెంకీ) అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్‌
*  మ‌నోడి ఎడిష‌న‌ల్ క్వాలిఫికేష‌న్ జాలి.
* సున్నిత‌త్వానికే అమ్మ‌మ్మ లాంటోడు
* ఇంతటి సున్నీతమైన కృష్ణ  స‌డెన్‌గా క్యారెక్ట‌ర్ మార్చేస్తాడు.
* విలన్ల భరతం పట్టేస్తాడు
* మధ్యలో నయన్ తో లవ్ గేమ్
* ‘బాబు బంగారం’లో వెంకీ చూపించే బొబ్బొలి రాజా మేనరిజం ఆకట్టుకుంటుందట
*నయన్ – వెంకీల మధ్య నడిచే లవ్ సీన్స్ నవ్వులు పూయిస్తాట
* జీబ్రాన్ అందిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సూపర్భ్ అంటున్నారు.
* వెంకీ సినిమా అంటేనే రిచ్ గా  ఉంటుంది. ఈ సినిమా కూడా తెరపై కాస్లీగా కనిపించనుందట.

మొత్తానికి.. వెంకీ నుంచి కోరుకునే అంశాలన్నీ పుష్కలంగా ఉన్న సినిమా బాబు బంగారం అని చెబుతున్నారు. ఈ సినిమా లవ్ అప్ డేట్స్, పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేస్తూనే ఉండండి మీ తెలుగు బుల్లెట్ డాట్ కామ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here