బాబు నిస్సహాయత ?

cm-babu-pres
ప్రత్యేక హోదా ఇవ్వలేనప్పుడు దానికి దీటుగా వచ్చే ప్యాకేజ్ ని కాదంటే ఎలా ? జైట్లీ ప్రెస్ మీట్ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన ఇది ….అంత అర్ధరాత్రి ప్రెస్ మీట్ అనగానే బాబు కేంద్రం మీద నిప్పులు చెరుగుతారని అంతా భావించారు.కానీ బాబు స్పందన భిన్నంగా కనిపించింది.అయన హావభావాలు ,శారీరక భాష చూస్తుంటే కేంద్ర వైఖరిపై అసంతృప్తి …మాటల్లో ఇక ఏమి చేయగలమన్న నిస్సహాయత ధ్వనించాయి.కేంద్రానికి వ్యతిరేకంగా వెళితే ఇచ్చే కాస్త కూడా ఆగిపోతుందేమోనన్న భయం కనిపించింది.

బాబు అర్ధరాత్రి ప్రెస్ మీట్ లో బులెట్ పాయింట్స్ ..

ఇచ్చిన దానికి స్వాగతం..ఇవ్వాల్సింది చాలా వుంది..
కేంద్రం తాజాగా ఇచ్చిన హామీలకి చట్టబద్ధత కావాలి ..
పోలవరానికి వెంటనే నిధులు విడుదల చేయాలి..
హోదా అవసరమున్నా,ప్రత్యామ్న్యాయాన్ని కాదంటే నష్టపోతాం ..
4పారిశ్రామిక నోడ్స్ నిర్దిష్ట కాలపరిమితిలో అమలు చేయాలి.
విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలి ..
రైళ్లు,రోడ్లు ఇలా సహజంగా వచ్చే వాటిని ప్యాకేజ్ గా ప్రకటిస్తే ప్రయోజనం లేదు ..
రెవిన్యూ లోటు ,రాజధాని విషయాల్లో నిర్దిష్ట ప్రకటన కావాలి..
నాటి కాంగ్రెస్ విధానం వల్లే ఇప్పుడిలా అడుక్కోవాల్సి వస్తోంది..
హోదా గురించి మొన్న పవన్ మాట్లాడారు..ఇప్పుడు కేంద్ర ప్రకటన చూసారు ..ఆయనెలా స్పందిస్తారో చూద్దాం ..రాష్ట్రాభివృద్ధికి ఎవరు సహకరించినా స్వాగతిస్తాం …

SHARE