బాబు రియలైజ్ ..అమరావతికి న్యూ డిజైన్

   babu giving to amaravathi design contract  hafeez contractor
అమరావతి డిజైన్ల విషయంలో వస్తున్న విమర్శలతో ముఖ్యమంత్రి చంద్రబాబు రియలైజ్ అయ్యారు.అంతర్జాతీయ ప్రమాణాలంటూ విదేశీ సంస్థలకి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పజెప్పాక వచ్చిన డిజైన్లపై విమర్శలు రావడంతో ఈ వ్యవహారంలో ఓ దేశీయ సంస్థ భాగస్వామ్యం ఉండాలని బాబు నిర్ణయించుకున్నారు.ఇప్పటికే ఈ రంగంలో విశేష అనుభవమున్న హఫీజ్ కాంట్రాక్టర్ ని డిజైన్ల అంశంలో కీలక భాగస్వామి అయ్యేలా రంగం సిద్ధం చేస్తున్నారు.

ఆయనతో బ్రిటన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్ కూడా భాగస్వామిగా ఉండబోతున్నారు. కాకపోతే వీరిద్దరూ కలసి గతంలోనే చాలా డిజైన్లు అందించారు. ఈ నెల 8న హైదరరాబాద్ లో జరిగిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో డిజైన్లు అందజేసిన మాకీ అసోసియేట్స్ ఈ నెల 15న మరోసారి కొత్త డిజైన్లు అందివ్వబోతోంది.

అవి చూసిన తర్వాత ..ఆ సంస్థతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని హఫీజ్ కాంట్రాక్టర్ తో ఒప్పందంతో చేసుకోనున్నారు. ఈ సంస్థకు భారీ నెట్ వర్క్ ఉన్నందున వేగంగా..మరింత మెరుగైన డిజైన్లు ఇవ్వగలదని సీఆర్ డీఏ భావిస్తోంది. వాస్తవానికి మాకీ అసోసియేట్స్ కేవలం డిజైన్ల కోసం 95 కోట్ల రూపాయలు ఇవ్వటానికి రెడీ అయిపోయింది. అయితే ఈ సంస్థ ఇఛ్చిన డిజైన్లు తీవ్ర విమర్శల పాలు కావటంతో సర్కారు కూడా వెనక్కిపోయింది. ఇప్పుడు కొత్త డిజైన్ల వేటలో పడింది. హఫీజ్ కాంట్రాక్టర్ తెలంగాణ ప్రభుత్వానికి కూడా పలు కొత్త డిజైన్లు అందించిన సంగతి తెలిసిందే.

SHARE