దళిత రాజకీయాలు బెడిసికొడుతున్నాయా..?

0
303
backward caste politics is not working

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

backward caste politics is not workingకర్ణాటక మాజీ సీఎం బీజేపీ నేత యడ్యూరప్ప వివాదానికి పార్టీ వివరణ ఇచ్చింది. తుముకూరు జిల్లాలో ఓ దళితుడైన మధుకుమార్ ఇంట్లో బస చేసిన ఆయన వారి ఇంట్లో భోజనం చేయకుండా రెస్టారెంట్ నుంచి ఇడ్లీలు తెప్పించుకొని తిన్నారు. దీంతో దళితులను యడ్యూరప్ప అంటరాని వాళ్లలాగా చూస్తున్నారని కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడ్డాయి. అంటరానితనాన్ని పాటిస్తున్నందుకు ఆయనపై కేసు నమోదు చేయాలని మాండ్యాలో ఓ సామాజిక కార్యకర్త పోలీసులను ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో బీజేపీ క్లారిటీ ఇచ్చింది.

బీజేపీ నేత సురేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మధుకుమార్ ఇంటికి యడ్యూరప్పతో సహా పలువురు బీజేపీ నేతలు వెళ్లారని పెద్ద సంఖ్యలో వెళ్లడంతో భోజనం సరిపోకపోవడం వల్లే బయటి నుంచి తెప్పించుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. యడ్యూరప్పతో పాటు ఆయన వెంట వెళ్లిన వారు భోజనాన్ని ఆస్వాదించారు. సంతోషకరమైన వేడుకను విపక్షాలు వివాదం చేయడం దురదృష్టకరం అని సురేశ్ కుమార్ అన్నారు.

కాగా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ దళితులను ఆకర్షించేందుకు బీజేపీ నేతలు ఇటీవల వారి ఇళ్లలో బస చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇటీవలే బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా బెంగాల్ లో దళిత కుటుంబం ఇంటిలో భోజనం చేశారు. అయితే మరుసటి రోజే ఆ దంపతులు టీఎంసీలో చేరడం గమనార్హం.

Leave a Reply