ఏమిటో ఈ లోకం ?

 Bahrain Pm Helps Odisha Man dana
కష్టాల్లో ఉన్నోళ్లని ఆదుకోవడంలో లోకం తీరు ఎంత చిత్రమో చెప్పడానికి ఇదో  ఉదాహరణ …చేతిలో చిల్లిగవ్వ లేక భార్య మృతదేహాన్ని భుజాన మోసిన దానా గుర్తున్నాడా ? ఒడిస్సా లోని కలహండి ప్రాంతానికి చెందిన ఈయన ఫోటో,వీడియో ఎంత సంచలనం రేపాయో చూశాం.నాడు కాళ్లావేళ్లా పడ్డా పట్టించుకోని లోకం ఆ వీడియో బయటపడ్డాక ఉదారంగా ఆదుకోడానికి ముందుకొచ్చింది .దేశంలోనే కాదు ఇతర దేశాలనుంచి కూడా చాలా మంది సాయం చేశారు .

వారిలో బహరేన్ ప్రధాని సైతం వున్నారు.ప్రభుత్వం ,ఇతర ప్రైవేట్ సంస్థలు,వ్యక్తులు కలిసి దాదాపు లక్షల రూపాయలు సాయం అందించారు.ఒక్క వీడియో,ఫోటో తో ఇంత స్పందన వచ్చిందిగానీ ఆరోజు ఒక్కరు కూడా ఎందుకు ఆదుకోలేదో దానా కి అర్ధం కావడం లేదు .అదే అంటున్న అతను ఏమిటోఈ లోకం అని నిర్వేదం చెందుతున్నాడు.విరాళాల రూపంలో వచ్చిన డబ్బుని పిల్లల చదువుకి ఉపయోగిస్తానంటున్నాడు.

[wpdevart_youtube]t2nySIMdNqs[/wpdevart_youtube]

[wpdevart_youtube]6SS8zRPhKzU[/wpdevart_youtube]

SHARE