మరో మైలురాయి దాటిన బాహుబలి

Posted May 19, 2017 at 16:26

bahubali 2 creating sensational collections
విడుదలకు ముందు నుండే సంచలనాలు సృష్టించిన ‘బాహుబలి 2’ చిత్రం ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ చిత్రంగా నిలవడం ఖాయం అని సినీ వర్గాల వారు అనుకున్నారు. అయితే వెయ్యి కోట్లకు అటు ఇటుగా లేదా దంగల్‌ కలెక్షన్స్‌ను బీట్‌ చేసే విధంగా వసూళ్లు రావచ్చు అనుకున్నారు. మొదటి పార్ట్‌ కంటే ఎక్కువగానే వసూళ్లు వస్తాయని ఆశించారు. అయితే కొందరు మాత్రం వెయ్యికోట్లు ఖచ్చితంగా వచ్చి తీరుతాయని అంచనా వేశారు. ఇప్పుడు లెక్కలు చూస్తుంటే ప్రతి ఒక్కరి అంచనా కూడా తారుమారు అయ్యింది. ఏ ఒక్కరు కూడా సినిమా విడుదలకు ముందు 1500 కోట్లు వసూళ్లు సాధిస్తుందని ఊహించి ఉండరు.

ఊహకు అందనంత దూరంగా ‘బాహుబలి’ నిలిచింది. అద్బుతమైన స్క్రీన్‌ప్లేతో పాటు, అనిర్వచనీయమైన విజువల్స్‌తో కంటికి ఇంపుగా సినిమాను తెరకెక్కించిన జక్కన్న సృష్టించిన అద్బుతం 1500 కోట్లు సాధించి మరో అరుదైన గౌరవంను దక్కించుకుంది. మొన్నటి వరకు ఇండియన్‌ సినిమా వెయ్యి కోట్లు అంటేనే అదో అద్బుతం. కాని ఇప్పుడు బాహుబలి ఏకంగా 1500 కోట్లు వసూళ్లు చేసి, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టగల సత్తా భవిష్యత్తులో వచ్చే సినిమాలకు ఉందా అనేది అనుమానమే. ఒక తెలుగు సినిమా ఈ స్థాయి వసూళ్లు సాధించినందుకు ప్రతి తెలుగు ప్రేక్షకుడు కూడా గర్వించదగ్గ విషయం.

SHARE