బాహుబ‌లి-2పై క‌న్న‌డ దెబ్బ‌!!

0
579
bahubali 2 lost in karnataka

Posted [relativedate]

bahubali 2 lost in karnataka
ద‌క్షిణాదిలో ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే.. క‌ర్ణాట‌క‌లో సినిమాలు చూడ‌డం కొంచెం త‌క్కువ‌. మంచి సినిమా అయితే త‌ప్ప క‌లెక్ష‌న్లు రావు. దీంతో ప్ర‌స్తుతం క‌న్న‌డ సినిమాలు క‌లెక్ష‌న్లు లేక ఢీలా ప‌డుతున్నాయి. అయితే అదే స‌మ‌యంలో తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాల సినిమాలు అక్క‌డ డ‌బ్ చేస్తే మాత్రం క‌లెక్ష‌న్లు బాగానే వ‌స్తున్నాయి. దీంతో క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ డ‌బ్బింగ్ పై గ‌ళ‌మెత్తింది. క‌న్న‌డ నాట డ‌బ్బింగ్ సినిమాల‌కు క‌ళ్లెం వేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

క‌న్న‌డ సినీన‌టుడు జ‌గ్గేష్.. చేసిన ట్వీట్ వాతావ‌ర‌ణాన్ని ఒక్క‌సారిగా హాట్ హాట్ గా మార్చేసింది. డ‌బ్బింగ్ చిత్రాల‌ను విడుద‌ల చేస్తే అది ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హానికి దారి తీసే అవ‌కాశ‌ముంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అంతేకాదు థియేట‌ర్ల‌ను కూడా త‌గ‌ల‌బెట్టే ప‌రిస్థితి రావొచ్చంటూ హెచ్చ‌రించారు. జగ్గేశ్ ట్వీట్ కు క‌ర్ణాట‌కలో పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. దీంతో డ‌బ్బింగ్ పై ఉద్య‌మంపై మొద‌లుకావ‌చ్చ‌న్న వాద‌న వినిపిస్తోంది.

మ‌రికొన్ని రోజుల్లో బాహుబ‌లి-2 రిలీజ్ కాబోతోంది. కన్న‌డంలోనూ ఆ సినిమాను డ‌బ్ చేస్తున్నారు. బాహుబ‌లి-1 కు పెద్ద ఎత్తున క‌లెక్ష‌న్ వ‌ర్షం కురిసింది. ఈ నేప‌థ్యంలో బాహుబ‌లి-2కు కూడా క‌లెక్ష‌న్ల సునామీ ఖాయ‌మ‌ని రాజ‌మౌళి అనుకున్నారు. కానీ ఇప్పుడు క‌న్నడ‌నాట డ‌బ్బింగ్ సినిమాల‌పై నిషేధం విధించే ఆలోచ‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో… బాహుబ‌లి-2 పై దెబ్బ‌ప‌డే అవ‌కాశాలున్నాయి. అదే జ‌రిగితే బాహుబ‌లి-2 క‌లెక్ష‌న్ల‌పై ఎంతో కొంత ఈ ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంది.

బాహుబ‌లి-2ను క‌న్న‌డంలో డ‌బ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని స‌మాచారం. ఆర్టిస్టుల‌తో డ‌బ్బింగ్ ను పూర్తి చేశార‌ని స‌మాచారం. ఈ స‌మ‌యంలో క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ గ‌ళ‌మెత్త‌డంతో.. బాహుబ‌లి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇప్పుడు టెన్ష‌న్ లో ఉన్నారు. క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో మాట్లాడే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. కానీ ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం క‌ష్ట‌మేనంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు!!!

Leave a Reply