Posted [relativedate]
ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా బాహుబలి-2 సినిమా గురించే. అంతలా రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో, ప్రభాస్ తన నటనతో అభిమానులను తమ మాయలో పడేశారు. రెండు రోజుల క్రితం బాహుబలి-2 ట్రైలర్ ని విడుదల చేసిన రాజమౌళి తాజాగా ఆడియోని కూడా విడుదల చేసే ఏర్పాట్లు చేస్తున్నాడు.
ఈ నెల 26న ఆడియో వేడుకని ఘనంగా నిర్వహించనున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించిన మాహిష్మతి రాజ్యం సెట్ లోనే ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమం జరగనుంది. నిజానికి రాజమౌళి సినిమాలకు బ్యాక్ బోన్ గా నిలిచేది సినిమాలోని ఆడియోనే. ఇప్పటివరకు ఆయన ప్రతి సినిమాకు కీరవాణి మ్యూజిక్ ని అందించారు. కీరవాణి అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయానికి ఎంతో దోహదపడ్డాయి. అటువంటి వీరి కాంబినేషన్ లో ఆడియో అంటే సంగీత అభిమానులకు పండగే. బాహుబలి ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కి కీరవాణి బెస్ట్ ట్యూన్స్ ని అందించాడని చాలాసార్లు రాజమౌళినే తెలిపాడు. మరి అటువంటి పాటలను వినాలనుకుంటే 26వరకు ఆగాల్సిందే.