ఖైదీ రికార్డులు బాహుబలి ముందు నిలువలేక పోయాయి

0
640
bahubali 2 movie breaks khaidi no 150 movie records

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

bahubali 2 movie breaks khaidi no 150 movie records
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం. 150’ చిత్రం ఉత్తరాంద్రలో ఏకంగా 10 కోట్లు వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అన్ని ఏరియాల్లో గతంలో భారీ వసూళ్లను సాధించిన బాహుబలి మొదటి పార్ట్‌ సినిమా ఉత్తరాంద్రలో 9 కోట్లు వసూళ్లు చేసింది. ఖైదీ దాన్ని దాటేసి రికార్డు సృష్టించింది. ఖైదీ రికార్డు నమోదు అయ్యి మూడు నెలలు కూడా కాకుండానే ‘బాహుబలి 2’ ఆ రికార్డును సునాయాసంగా బ్రేక్‌ చేసింది.

ఖైదీకి ఉత్తరాంద్రలో 10 కోట్ల వసూళ్లు సాధించేందుకు రెండు నెలలు పట్టింది. కాని ‘బాహుబలి 2’కు మాత్రం కేవలం వారం రోజులు కూడా పట్టలేదు. కేవలం ఆరు రోజుల్లోనే 10 కోట్ల మర్క్‌ను దాటి, లాంగ్‌ రన్‌లో 15 కోట్లు వసూళ్లు చేయగల సత్తా ఉందని చెప్పకనే చెప్పింది. ఇక అన్ని ఏరియాల పరిస్థితి కూడా ఇంతే ఉంది. ఇతర సినిమాలు ఇప్పటి వరకు కష్టపడి క్రియేట్‌ చేసిన రికార్డులు అన్ని కూడా మొదటి వారంలోనే బ్రేక్‌ చేసింది. ఇప్పుడు బాహుబలి క్రియేట్‌ చేసిన రికార్డులు మళ్లీ రాజమౌళి సినిమా చేస్తే తప్ప బ్రేక్‌ అయ్యే పరిస్థితి లేదని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

Leave a Reply