‘బాహుబలి 2’ సెన్సార్‌ టాక్‌

Posted April 18, 2017

bahubali 2 movie censor report talk
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రం మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ‘బాహుబలి 2’ సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సహజంగా సెన్సార్‌ బోర్డు సభ్యులు సినిమా చూసి ఎలా ఉందనే విషయంపై ఏమీ స్పందించకుండా సెన్సార్‌ సర్టిఫికెట్‌ మాత్రం ఇస్తారు. కాని కొన్ని సినిమాలపై మాత్రం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. తాజాగా ‘బాహుబలి 2’ సెన్సార్‌ స్క్రీనింగ్‌లో పాల్గొన్న సభ్యులు మాత్రం చిత్రంపై ప్రశంసలు జల్లు కురిపించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

‘బాహుబలి 2’కు సెన్సార్‌ సభ్యులు యూ/ఎ సర్టిఫికెట్‌ను ఇవ్వడం జరిగింది. యుద్ద సన్నివేశాల కారణంగా ఈ సర్టిఫికెట్‌ ఇచ్చారట. ఇక ఏమాత్రం అశీల్లం లేకుండా అద్బుతమైన విజువల్స్‌తో ఈ సినిమా ఉందని సెన్సార్‌ బోర్డు సభ్యులు చెబుతున్నారు. తప్పకుండా ఈ సినిమా మొదటి పార్ట్‌ స్థాయిలో ఆడుతుందనే నమ్మకంను సెన్సార్‌ బోర్డు సభ్యు వ్యక్తం చేశారు. ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. వెయ్యి కోట్ల వసూళ్లు ఖాయం అని చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

SHARE