‘బాహుబలి 2’ చైనాకు వెళ్తే…!

0
616
bahubali 2 movie going to china

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

bahubali 2 movie going to chinaబాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ఖాన్‌ నటించిన ‘పీకే’ మరియు ‘దంగల్‌’ చిత్రాన్ని చైనాలో విడుదల అవ్వడం వల్ల భారీ వసూళ్లు సాధ్యం అయ్యాయి. తాజాగా విడుదలైన ‘దంగల్‌’ చిత్రం చైనాలో దాదాపుగా 400 కోట్లు వసూళ్లు చేసినట్లుగా అనధికారిక సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఇండియన్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రాల జాబితాలో రెండు మరియు మూడవ స్థానంలో అమీర్‌ ఖాన్‌ నటించిన ఆ సినిమాలు ఉన్నాయి. ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ కూడా చైనాలో విడుదలైంది. కాని అక్కడ పెద్దగా ఆధరణ దక్కలేదు. అయితే సెకండ్‌ పార్ట్‌కు అక్కడ ఖచ్చితంగా ఆధరణ లభిస్తుందని, చైనాలో విడుదల చేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

ఒకవేళ ‘బాహుబలి 2’ సినిమా చైనాలో విడుదలైతే కలెక్షన్స్‌ 2000 కోట్లకు చేరడం ఖాయంగా సినీ వర్గాల వారు చెబుతున్నారు. ప్రస్తుతం ‘బాహుబలి 2’ చైనాలో విడుదల కాకుండానే 1400 కోట్ల కలెక్షన్స్‌ను వసూళ్లు సాధించింది. చైనాలో కూడా విడుదలైతే బాగుండు అని సగటు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. అయితే మొదటి పార్ట్‌ సక్సెస్‌ కాని నేపథ్యంలో రెండవ పార్ట్‌ను అక్కడ విడుదల చేసేందుకు నిర్మాతలు సాహసం చేయడం లేదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా చైనాకు ‘బాహుబలి 2’ను తీసుకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. కాస్త ఆలస్యంగా అయిన ‘బాహుబలి 2’ను చైనాకు తీసుకు వెళ్తారేమో చూడాలి.

Leave a Reply