‘బాహుబలి 2’ పైరసీ వచ్చేసింది.. ఇలా అయితే ఎలా?

0
589
bahubali 2 movie piracy halchal in internet

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

bahubali 2 movie piracy halchal in internet
దేశ వ్యాప్తంగా సినీ జనాలు ఎదురు చూసిన ‘బాహుబలి 2’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్నటి నుండే థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన కేంద్రాల్లో ప్రీమియర్‌ షోలు వేసిన విషయం తెల్సిందే. ప్రీమియర్‌ షోలు వేస్తున్న సమయంలోనే ఈ సినిమాను పైరసీ చేసినట్లుగా తెలుస్తోంది. అప్పుడే ఆన్‌లైన్‌లో ‘బాహుబలి 2’ సినిమా మంచి క్వాలిటీతో లభిస్తుంది.

ఈ సంఘటనపై సైబర్‌ పోలీసులకు ‘బాహుబలి’ నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ‘బాహుబలి 2’ లింక్‌లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సంఘటనకు బాధ్యులు అయిన వారిని కఠినంగా శిక్షించాలంటూ తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలతో పాటు దేశ వ్యాప్తంగా చిత్ర ప్రముఖులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా జరిగితే సినిమా పరిశ్రమ నాశనం అవుతుందని, పైరసీతో సినిమాకు కోట్లు నష్టం వాటిల్లుతుందని చిత్ర పరిశ్రమ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు ‘బాహుబలి 2’ చిత్ర యూనిట్‌ సభ్యులు ఇదో విజువల్‌ వండర్‌ సినిమా, తప్పకుండా థియేటర్‌లోనే చూడాలని పైరసీ చూడటం వల్ల మంచి ఫీల్‌ ఉండదు అంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply