Posted [relativedate]
విజువల్స్ వండర్ గా తెరకెక్కిన బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచదృష్టిని తెలుగు సినీ పరిశ్రమ వైపుకు తిప్పింది ఈ రాజమౌళి సృష్టి. దీనికి సీక్వెల్ గా రూపొందిన బాహుబలి-2 ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా రానున్న ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురుచూస్తోంది.. ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. వారి అంచనాలను మరింత పెంచే విధంగా జక్కన్న ట్రైలర్ ని కూడా బాగా చెక్కాడు. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి దర్శకనిర్మాతలే షాక్ అయ్యారట. దీంతో రిలీజ్ కి భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ముందుగా అనుకున్న ధియేటర్స్ కంటే ఎక్కువ ధియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారని సమాచారం.
120 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందిన బాహుబలి సీక్వెల్ ని దేశవ్యాప్తంగా 6,500 స్క్రీన్స్ లో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారట. దీనితో పాటు ప్రపంచవ్యాప్తంగా మరో వెయ్యి స్క్రీన్స్ పై విడుదల చేయనున్నారట. తొలిసారి ఒక తెలుగు సినిమాను ఇన్ని స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తుండడంతో భారతీయ సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది.