బాహుబలి ట్రైలర్ రిలీజ్ డేట్ తెలిసిపోయిందిగా..

0
622
bahubali 2 movie theatrical trailer details

Posted [relativedate]

bahubali 2 movie theatrical trailer detailsరెండు సంవత్సరాలుగా సినీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా బాహుబలి-2 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వారి నిరీక్షణకి తెరపడనుంది. మరికొద్ది రోజుల్లోనే ఆ సినిమా విడుదలకానుంది. ఈ లోపల అభిమానులకు ట్రైలర్ చూపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు రాజమౌళి.

బాహుబలి థియేట్రికల్‌ ట్రైలర్‌ ను ఈ నెల‌ 16న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలోనూ ఆ రోజు ఉదయం 9గం. నుంచి 10గం. మధ్య విడుదల చేయనున్నట్లు ప్ర‌క‌టించింది. అదే రోజు సాయంత్రం 5గంటలకు సోష‌ల్ మీడియాలోనూ ఈ మూవీ ట్రైల‌ర్‌ విడుదల చేయనున్నారు. ఈ ట్రైల‌ర్ రెండున్న‌ర నిమిషాల నిడివి ఉండనుందని సమాచారం. బాహుబలి-1 క్రియేట్ చేసిన అంచనాలను బాహుబలి-2 బద్దలు కొట్టి సరికొత్త అంచనాలను సృష్టిస్తాడేమో చూడాలి.

Leave a Reply