Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వారం రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బాహుబలి 2’ సినిమా సంచలన కలెక్షన్స్ను సాధించింది. ప్రస్తుం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం ఏ సినిమా అయినా వారం రోజులు మాత్రమే భారీ వసూళ్లను సాధించాలి. వారం తర్వాత చిల్లర చిల్లర అమౌంట్స్ వస్తాయి. కాని అన్ని సినిమాలు వేరు ‘బాహుబలి’ వేరు. అందుకే రెండవ వారంలో కూడా భారీ వసూళ్లను సాధించే దిశగా ‘బాహుబలి’ అడుగులు పడుతున్నాయి. నిన్నటి వరకు 850 కోట్లు రాబట్టిన ‘బాహుబలి’కి మరో రెండు రోజులు భారీ వసూళ్లు ఖాయంగా కనిపిస్తుంది.
నేడు శనివారం మరియు రేపు ఆదివారాల్లో ‘బాహుబలి 2’ అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరిగింది. మొదటి వారం రోజులే కాకుండా పది రోజుల పాటు టికెట్ల రేట్లను అధిక మొత్తంలో అమ్మే అనుమతిని చిత్ర నిర్మాతలు ప్రభుత్వం నుండి పొందారు. దాంతో ఈ రెండు రోజులు కూడా భారీగా వసూళ్లు సాధించడం ఖాయంగా తెలుస్తోంది. ఈ రెండు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో కలిపి రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుంది. అంటే పది రోజుల్లోనే 1100 కోట్లు వసూళ్లు సాధించనున్నదన్నమాట. లాంగ్ రన్లో మరో 300 కోట్లు వసూళ్లు సాధిస్తుందేమో చూడాలి. మొత్తంగా ‘బాహుబలి 2’ 1300 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ సభ్యులున్నారు.