మరోసారి కాపీక్యాట్ గా మారిన రాజమౌళి..!!

0
373
bahubali 2 poster same to same ong bak2 movie poster

 

Posted [relativedate]bahubali 2 poster same to same ong bak2 movie posterటాలీవుడ్ లో కొన్ని సినిమాలను ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాల ఆధారంగా రూపొందిస్తారన్న విషయం తెలిసిందే. కొద్దిపాటి మార్పులతో మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కిస్తుంటారు. ఇక మరికొన్ని  సినిమాల్లో అయితే ఏకంగా సీన్లను కూడా యాజ్ ఇట్ ఈజ్ దింపేస్తుంటాయి తెలుగు సినీ వర్గాలు. ఇటువంటి కాపీ క్యాట్ పనులకు దర్శకధీరుడు రాజమౌళి కూడా మినహాయింపు కాదని మరో సారి ప్రూ చేశారు నెటిజన్లు.

బాహుబలి ఫస్ట్ పార్ట్ లో కొన్ని సీన్లను యధాతదంగా హాలీవుడ్ ని దింపేశాడని అప్పట్లో సోషల్ మీడియాలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా శివరాత్రి కానుకగా నిన్న  రిలీజ్ చేసిన ప్రభాస్ పోస్టర్ కూడా ఓ హాలీవుడ్ మూవీ పోస్టర్ నుండి కాపీ చేసిందే అని బయటపడింది.

హాలీవుడ్ న‌టుడు టోనీ ఝా న‌టించిన `ఆంగ్ బాక్‌` సిరీస్ లోని `ఆంగ్ బాక్ 3` ని కాపీ చేశాడంటున్నారు విమర్శకులు. ఆంగ్ బాక్ 3 లో ఒళ్లు గ‌గుర్పొడిచే విన్యాసాల‌తో ఝా చేసే పోరాట విన్యాసాలు అద్భుతంగా అనిపిస్తాయి. ఆ సినిమా క్రియేటివ్ పోస్ట‌ర్ ని రాజమౌళి కాపీ కొట్టేశాడని తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు తెగ షేర్ అయిపోతున్నాయి.

కనీసం ఈ సారి రిలీజ్ చేసే పోస్టర్ అయినా కాపీవి కాకుండా సొంతంగా చేయాలని సూచిస్తున్నారు.

Leave a Reply