Posted [relativedate]
దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న ఇండియన్ సినీ ప్రముఖులు ఎంతో ఆసక్తిగా ‘బాహుబలి 2’ చిత్రం కోసం ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. దాదాపుగా ఎనిమిది వేల థియేటర్లలో ఈనెల 28న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయనివ్వం అంటూ కొన్ని కన్నడ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అందుకు ప్రభుత్వం కూడా మద్దతు తెలుపుతున్నాయి. చాలా సంవత్సరాల క్రితం బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ కన్నడ ప్రజలకు వ్యతిరేకంగా కావేరీ జలాల విషయంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ‘బాహుబలి’పై ప్రభావం చూపబోతున్నాయి.
కన్నడ ప్రజలపై విమర్శలు చేసిన సత్యరాజ్ నటించిన సినిమాను కర్ణాటకలో విడుదల కానివ్వబోం అంటున్న కన్నడ ప్రజా సంఘాల హెచ్చరికలపై తాజాగా దర్శకుడు రాజమౌళి స్పందించాడు. చాలా సంవత్సరాల క్రితం సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు తమ సినిమాను అడ్డుకోవడం మంచి పద్దతి కాదని, అసలు ఆ వివాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటప్పుడు సినిమాను ఎందుకు అడ్డుకుంటారని, ఆ వివాదం గురించి తనకు పూర్తి వివరాలే తెలియదు అంటూ రాజమౌళి కర్ణాటకలో ప్రమోషన్స్ సందర్బంగా చెప్పుకొచ్చాడు. తమ సినిమాను విడుదల అవ్వనివ్వాల్సిందిగా జక్కన్న కోరాడు. మరి జక్కన్న విజ్ఞప్తిని వారు పట్టించుకుంటారా అనేది చూడాలి.