బాహుబలి ది కంక్లూజన్ ….తెలుగుబుల్లెట్ రివ్యూ

155
Spread the love

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

bahubali 2 review బ్యానర్‌: ఆర్కా మీడియా వర్క్స్‌
తారాగణం: ప్రభాస్‌, రాణా దగ్గుబాటి, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌, తమన్నా, సుబ్బరాజు తదితరులు
కథ: విజయేంద్రప్రసాద్‌
మాటలు: సి.హెచ్‌. విజయ్‌కుమార్‌, అజయ్‌ కుమార్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
కళ: సాబు సిరిల్‌
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: కె.కె. సెంథిల్‌ కుమార్‌
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని
కథనం, దర్శకత్వం: ఎస్‌.ఎస్‌. రాజమౌళి

ఎన్నాళ్ళ నుంచో ఊరిస్తూ ప్రపంచవ్యాప్తంగా 8000 వేల స్క్రీన్స్ మీద విడుదలైన బాహుబలి ది కంక్లూజన్ సినిమా అంచనాలకు తగ్గట్టు ఉందా లేదా ఓ సారి చూద్దామా ..

కథ… బాహుబలిని రాజుగా ప్రకటించిన శివగామి ,సింహాసనం ఎక్కబోయే ముందు ప్రజల గురించి తెలుసుకునేందుకు దేశ పర్యటనకు వెళ్ళమని అతన్ని ఆదేశిస్తుంది.తోడుగా కట్టప్పని ఇచ్చి పంపుతుంది.ఆ పర్యటనలో భాగంగా కుంతల దేశం వెళ్లిన బాహుబలి అక్కడ చూసిన దేవసేన ప్రేమలో పడతాడు.ఇంతలో శివగామి దగ్గర నుంచి మాహిష్మతి రాజుని కళ్యాణం చేసుకోవాలని కోరుతూ దేవసేనకి సందేశం అందుతుంది.అయితే దేవసేన అందుకు అంగీకరించదు. ఆమెని ఒప్పించి మాహిష్మతికి తీసుకొచ్చిన బాహుబలికి ఊహించని పరిణామం ఎదురవుతుంది.దేవసేనకి భళ్లాలదేవుడుతో పెళ్లి జరిపించాలని శివగామి భావిస్తున్నట్టు తెలుస్తుంది.ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుంటుండగానే రాజుగా కూడా భళ్లాలదేవుడుని శివగామి నియమిస్తుంది.బాహుబలి కేవలం సేనాధిపతి అవుతాడు.అయినా అంతటితో ఆగని భల్లాలుడు తన కుట్రలు,కుతంత్రాలతో కట్టప్ప చేతుల్లో బాహుబలిని చంపిస్తాడు.అతను సొంత తల్లిని కూడా ఎందుకు వెంటాడతాడు?కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపుతాడు ? ఈ విషయాలతోపాటు చివరికి ఏమవుతుందో తెలుసుకోడానికి బాహుబలి ది కంక్లూజన్ చూడాల్సిందే.

బాహుబలి బలాలు … బాహుబలి మొదటి భాగం విడుదల అయినప్పుడు అక్కడక్కడా విమర్శలు వినిపించాయి.సినిమాలో గ్రాండ్ నెస్ తప్ప కంటెంట్ బాగాలేదని కొంత అసంతృప్తి కనిపించింది. బాహుబలి 2 తో ఆ కొరత తీరింది.ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాతో రాజమౌళి తన స్థాయిని మాత్రమే కాదు భారతీయ సినిమా స్థాయిని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లాడు.గ్రాఫిక్స్,సెట్టింగ్స్,కథ,కధనం అన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు వుంది.ఇక రాజమౌళి బలమైన భావోద్వేగాలు సెకండ్ పార్ట్ లో పుష్కలంగా వున్నాయి.

నటీనటులు …..ప్రభాస్,రానా,అనుష్క,రమ్యకృష్ణ,నాజర్,సత్యరాజ్ నటన ఈ సినిమా స్థాయిని ఇంకా పెంచింది.ఈ తరహా సినిమాల్లోనూ తమడైన నటనతో వాళ్ళు హాల్ లోనే కాదు మన ఇంటిదాకా వచ్చేస్తారు.మన మనస్సులో నిండిపోతారు.భారతీయ నటీనటుల ప్రతిభకి ఓ కొలమానంలా సాగింది వీళ్ళ పెర్ఫార్మన్స్.

బాహుబలి బలహీనత లు … బాహుబలి సినిమాలో డ్రామా అక్కడక్కడా కధా గమనాన్ని స్లో చేసింది. ఇక కట్టప్ప బాహుబలిని చంపే కారణం,ఆ ఎపిసోడ్ రివీల్ అయ్యాక కధనం ప్రేక్షకుడి ఊహలకు తగ్గట్టు సాగడం.ప్రభాస్,అనుష్క లవ్ సీన్స్ కొంచెం సాగదీసినట్టు అనిపించడం.

టెక్నికల్ …ఈ చిత్రానికి పనిచేసిన రాజమౌళి సహా అందరు సాంకేతిక నిపుణులు తమ జీవిత కాలం గుర్తుంచుకునే అవుట్ అవుట్ ఇచ్చారు.కీరవాణి సంగీతం,కెమెరామెన్ సెంథిల్ పనితనం,గ్రాఫిక్ వర్క్ ..ఇవన్నీ రాజమౌళి ఊహా ప్రపంచాన్ని ఇంకా విస్తృతం చేయడానికి,అందంగా, అద్భుతంగా కనిపించడానికి దోహదం చేశాయి.ఇప్పటిదాకా భారతీయ తెర మీద వచ్చిన సినిమాల్లో ఇంతకుమించిన సాంకేతిక అద్భుతం లేదనే చెప్పుకోవాలి.

ఫైనల్ టచ్ ...మొత్తంగా బాహుబలి ది కంక్లూజన్ థియేటర్ లోకి వెళ్ళినప్పటినుంచి మిమ్మల్ని మాహిష్మతి రాజ్యానికి,ఆనాటి కాలానికి తీసుకెళుతుంది.అక్కడి ప్రజల్లో మీరు ఒకరు అనుకునేలా కథ సాగుతుంది.కథ సింపుల్ అయినా సినిమా అన్నివిధాలుగా భారీగా ఉంటుంది.మీ మనస్సుని దోచేస్తుంది.

తెలుగుబుల్లెట్ బాటమ్ లైన్ ...రాజమౌళి నిజంగా సృజనాత్మక బాహుబలి
తెలుగు బులెట్ రేటింగ్ ….4 /5 .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here