Posted [relativedate]
బాహుబలి-2 ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ సమయం రానే వచ్చేసింది. ఏప్రిల్ -28న ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పనుంది ఈ సినిమా. అదేనండీ.. ఏప్రిల్ -28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ పనులను చకచకా లాగిచ్చేస్తున్నాడు దర్శకుడు రాజమౌళి.
శివరాత్రి రోజున బాహుబలి-2 మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన రాజమౌళి త్వరలోనే ట్రైలర్ ని కూడా విడుదల చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ ట్రైలర్ కి ముహూర్తాన్ని ఫిక్స్ చేశాడు. మార్చి 15న బాహుబలి ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. బాహుబలి పార్ట్ 1 ట్రైలర్ ని ముంబైలో ఘనంగా విడుదల చేశారు. ఈసారి పార్ట్ 2 ట్రైలర్ ని కూడా ముంబైలో లాంచ్ చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు బాహుబలి సమర్పకుడు కరణ్ జోహార్ ముంబైలో ఏర్పాట్లు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్ నిడివి దాదాపుగా రెండున్నర నిమిషాలు ఉండొచ్చని సమాచారం. తెలుగుతో పాటు మిగిలిన భాషల ట్రైలర్లని ఏక కాలంలో విడుదల చేస్తారని తెలుస్తోంది. అలాగే ఉగాది పండుగ సందర్భంగా ఆడియోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడట రాజమౌళి.