హాలీవుడ్ సినిమాలను వదలని రాజమౌళి?

0
713
bahubali 2 trailer scenes coffee from hollywood movie

Posted [relativedate]

bahubali 2 trailer scenes coffee from hollywood movieబాహుబలి-1 సినిమాలో పలు సన్నివేశాలను హాలీవుడ్ సినిమాల నుండి యాజ్ ఇట్ ఈజ్ దింపేశాడని రాజమౌళి విమర్శలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో జక్కన్న బాహుబలి-2లో నైనా జాగ్రత్త పడతాడని చాలా మంది భావించారు. అయితే ఇప్పుడు మాత్రం రాజమౌళి హాలీవుడ్  సినిమాలను వదిలేలా లేడని విమర్శలు వస్తున్నాయి. శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ప్రభాస్ పోస్టర్ ని చూస్తే ఈ విమర్శలు నిజమేనని ఒప్పుకోవాల్సిందే. హాలీవుడ్ న‌టుడు టోనీ ఝా న‌టించిన `ఆంగ్ బాక్‌` సిరీస్ లోని `ఆంగ్ బాక్ 3` సినిమా పోస్టర్ ని కాపీ చేశాడని ఫొటోలతో సహా నిరూపించేశారు నెటిజన్లు. కాగా తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో కూడా పలు కాపీ.. పేస్ట్ లు ఉన్నాయంటూ విమర్శలు మొదలయ్యాయి.

ఈ రోజు ఉదయం బాహుబలి-2 ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లో కళ్లు చెదిరేలా ఉన్న విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, మాహిష్మతి రాజ్యానికి సంబంధించిన లోకేషన్లు.. అన్నీ అబ్బో అనిపించే విధంగా ఉన్నాయి. దీంతో ఈ  ట్రైలర్ ఉదయం నుండి తెగ ట్రేడ్ అవుతోంది. కొంతమంది ట్రైలర్ ని చూసి ఎంజాయ్ చేస్తుంటే మరి కొంతమంది మాత్రం సన్నివేశాల వెనక ఉన్న సీక్రెట్ ని  వెదికే వేటలో పడ్డారు. వారి వేటలో చాలానే కాపీ సన్నివేశాలు పడ్డాయి. మాహిష్మతి సామ్రాజ్యం ముందు ప్రభాస్ మీద బాణాలు పడే సన్నివేశాన్ని హెరిక్యులెస్ అనే హాలీవుడ్ సినిమా నుండి కాపీ చేశారని గ్రహించారు. అలానే హీరోని అందరి చేతులు చుట్టుముట్టే సన్నివేశాన్ని బ్యాట్ మ్యాన్ నుండి కాపీ చేశాడట. దీంతో రాజమౌళిపై కామెంట్లు షరా మాములుగా వినిపిస్తున్నాయి. బాహుబలి-2 కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని, ఇటువంటి సమయంలో ఇలా కాపీ సన్నివేశాలు దర్శనమిస్తే తెలుగు సినిమాకి అది మచ్చగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కొన్ని సన్నివేశాలు రిలేటెడ్ గా ఉంటే వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మన నేటివిటీకి తగ్గట్లు తెరకెక్కిస్తే తప్పేంటని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. రాజమౌళి  రూపొందించిన సన్నివేశాల్లో  తప్పులు వెదకడం మానమని సలహా ఇస్తున్నారు.  

Leave a Reply