Posted [relativedate]
దగ్గుబాటి వారసుడు బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు తనయుడు రానా డబ్బు మనిషి అనుకుంటే పొరపాటు పడ్డట్టే. అసలు తన రెమ్యునరేషన్ విషయాలను పట్టిచుకోను అంటున్నాడు ఈ భళ్లాలదేవ. రాజమౌళి బాహుబలికి సెలెక్ట్ చేయడానికి ముందు రానా ఇమేజ్ వేరు కాని బాహుబలి మొదటి పార్ట్ లో భళ్లాలదేవగా అదరగొట్టిన రానా ఇక సెకండ్ పార్ట్ లో విలనిజం ప్రదర్శించనున్నాడు. పార్ట్-2 లో తన పోర్షన్ ఎప్పుడో పూర్తి చేసుకున్న రానా ప్రస్తుతం తెలుగు తమిళ హింది భాషల్లో ఘాజి సినిమా చేస్తున్నాడు.
నౌకా దళానికి సంబందించిన కథతో వస్తున్న ఈ సినిమా ఓ కొత్త ప్రయోగం అంటున్నాడు రానా. ఇదనే కాదు తనకు నచ్చే తను సూట్ అయ్యే ఎలాంటి ప్రయోగాత్మక కథతో అయినా తన దగ్గరకు వస్తే తను తప్పకుండా రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా నటిస్తా అని అంటున్నాడు రానా. సినిమా హిట్ అయితే వచ్చిన లాభాల్లో షేర్ అడుగుతాను తప్ప రెమ్యునరేషన్ గురించి సినిమా అవకాశాన్ని వదులుకోను అంటున్నాడు.
స్టార్ నిర్మాత కొడుకుగా భారీ బడ్జెట్ సినిమాలు తీసే సత్తా ఉన్నా కేవలం నూతన దర్శకులతో తనను మెచ్చి వచ్చిన దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు రానా. ఇక చేసే సినిమా ఏదైనా కమిట్ మెంట్ ఇచ్చాడు అంటే ఆ పాత్ర ఇరగదీసేస్తాడు. ప్రస్తుతం కెరియర్ అంతా సాటిస్ఫైడ్ గా ఉంది అంటున్న రానా రాబోయే రోజుల్లో ఇంకా ప్రయోగాలు చేస్తానని అంటున్నాడు.