Posted [relativedate]
బాహుబలి సినిమాలోని పాటలు గుర్తున్నాయి కదూ. మర్చిపోయే పాటలా అవి అనుకుంటున్నారు కదూ.. నిజమే అందులో ఇరుక్కుపో హుత్తుకుని ధీర ధీర… మనోహరీ అనే సాంగ్ ఆ సంవత్సరం యూ ట్యూబ్ లో ఎక్కువమంది వీక్షించిన సాంగ్ గా ఫస్ట్ స్ధానాన్ని కూడా దక్కించుకుంది. బాగా పాపులర్ అయిన ఈ పాటలో ప్రభాస్ ముగ్గురు నాజూకు మెరుపు తీగలతో డాన్స్ కూడా చేశాడు. ఈ ముగ్గురు మెరుపు తీగలు ఓ రేంజ్ లో తమ టాలెంట్ ని చూపించారు. వాళ్లల్లో ఒకరైన మధుస్నేహ తాజాగా మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ తో కూడా కాలు కదపనుందని సమాచారం.
లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న మిస్టర్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ఎండింగ్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాట కోసం మధు స్నేహని రంగంలోకి దింపుతున్నాడట శ్రీను వైట్ల. ఈ సాంగ్ కోసం భారీ సెట్ ని కూడా వేసేశారట. మరి ఇరుక్కుపో.. కొరుక్కుపో అంటూ తెలుగు ప్రేక్షకులను రెచ్చగొట్టిన ఈ మనోహరి ఈ సారి ఎలా అలరిస్తుందో చూడాలి.