ఏ తెలుగు సినిమాకు దక్కని గౌరవం బాహుబలికి..!

Posted April 22, 2017 at 16:08

bahubali got a great applause among telugu films
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ఎన్నో ప్రశంసలు అందుకుంది. మొదటి పార్ట్‌ బాలీవుడ్‌ సినిమాల స్థాయిలో భారీ వసూళ్లను సాధించిన విషయం తెల్సిందే. ఇక రెండవ పార్ట్‌ ఈనెల 28న విడుదల కాబోతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా వెయ్యి కోట్లు వసూళ్లు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ‘బాహుబలి’ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. తాజాగా ఈ సినిమా గురించి ఇండియా టుడేలో కవర్‌ స్టోరీ రాయడం జరిగింది.

ఒక సౌత్‌ సినిమా గురించి ఇండియా టుడే కవర్‌ స్టోరీ రాయడం ఇదే ప్రథమం. అత్యంత అరుదుగా మాత్రమే సినిమాల గురించి ఇండియా టుడేలో కథనాలు రాస్తూ ఉంటారు. అయితే కవర్‌ స్టోరీ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లకు మాత్రమే దక్కుతుంది. జక్కన్న తెరకెక్కించిన ఈ సినిమాకు ఇది మరో అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు. వెయ్యి కోట్ల భారీ కలెక్షన్స్‌ను సాధిస్తుందనే నమ్మకంతో ఉన్న చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రస్తుతం ప్రచార కార్యక్రమంలో జోరుగా పాల్గొంటున్నారు. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన జక్కన్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు గర్వించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

SHARE