సర్కార్ సెట్లో బాహుబలి

Posted October 28, 2016

rajamouli-in-sarkar-3-setsఇటీవలే ‘సర్కార్-3’ సెట్ లో బాలకృష్ణ, కృష్ణవంశీలు ప్రత్యక్షమయ్యారు.ఆ విశేషాల గురించి అభిమానులు ఇంకా చర్చించుకుంటూనే ఉన్నారు. తాజాగా, ‘సర్కార్-3’ సెట్ లో ది గ్రేట్ బాహుబలి రాజమౌళి దర్శనమిచ్చారు. బిగ్ బీ అమితాబ్ తో స్పెషల్ గా ముచ్చటించారు. ఈ విషయాన్ని అమితాబ్ తో సర్కార్-3 తెరకెక్కిస్తోన్న దర్శకుడు రాంగోల్ వర్మ ట్విట్ చేశాడు.  “ఫిల్మ్ మేకింగ్ లో బాహుబలి యాక్టింగ్ లో బాహుబలి తో కలిసారు” అంటూ వర్మ తనదైన శైలిలో ట్విట్ చేశారు.

‘రైతు’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలయ్య, వంశీలు సర్కార్-3 సెట్ లో బిగ్ బీని కలిశారు. అందుకు బిగ్ బీ అంగీకరించాడు కూడా. ‘రైతు’ సినిమాలో బిగ్ బీ రాష్ట్రపతిగా కనిపించబోతున్నారు. ఈ విషయం కాసేపు ప్రక్కనపడితే.. రాజమౌళి బిగ్ బీ ని ఎందుకు కలిసినట్టు.. ? బాహుబలి 2లో బిగ్ బీ ఏమైనా కనిపించబోతున్నాడా.. ? లేదా బాహుబలి2లో బిగ్ బీ వాయిస్ ఏమైనా వినిపించబోతుందా.. ??? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే,అదంతా ఏమీ కాదు. బాహుబలి 2 ప్రమోషన్స్ భాగంగా ముంబై వెళ్లిన రాజమౌళి మర్యాద పూర్వకంగా అమితాబ్ ని కలిసినట్టు తెలుస్తోంది. మొత్తానికి రాజమౌళి-బిగ్ బీ కలయిక ఆసక్తిరేకెత్తిస్తొంది.

The Bahubali of film making with the Bahubali of acting on the sets of Sarkar 3

SHARE