మీరు.. ‘బాహుబలి’ సెట్స్ లో ఉండాలనుకుంటున్నారా.. ?

Posted October 3, 2016

bahubali making videos‘బాహుబలి’.. తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం. ఈ
చిత్రం సీక్వెల్ ‘బాహుబలి2’ని అంతకంటే అదిరిపోయే రేంజ్ లో
తెరకెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి. గ్రాఫిక్స్ పరంగా కొంత
టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయితే, బాహుబలి2 షూటింగ్ చివరి దశకు
చేరుకోవడంతో ప్రమోషన్స్ పై ఫోకస్ చేశాడు జక్కన్న.

ఈ సినిమా ప్ర‌మోష‌న్ విష‌యంలో ఎవ‌రూ చేయ‌ని విధంగా వర్చువ‌ల్ రియాలిటీలో
మేకింగ్ వీడియోల‌ను విడుద‌ల చేస్తున్నాడు. ఈ టెక్నాల‌జీతో బాహుబ‌లి
సెట్స్‌లో ఉన్న‌ట్లు ఫీల‌వుతూ విజువ‌ల్స్ చూసే అవ‌కాశం ఉంటుంది. దీని
కోసం చిత్ర టీమ్ 25కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు పెట్ట‌నుంది.
సో.. బాహుబలి షూటింగ్ లో ఉండాలనుకునేవారంతా.. వర్చువ‌ల్ రియాలిటీలో
రూపొందుతున్న మేకింగ్ వీడియోన్స్ ని వీక్షిస్తే సరిపోద్ది.

ఇక, ‘బాహుబలి2’ కథంతా దేవసేన (అనుష్క) చుట్టూ తిరగనుందనే ఇటీవలే మీడియా
ముందుకొచ్చిన బాహుబలి టీం చెప్పిన విషయం తెలిసిందే. ప్రభాస్, రానా,
అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, అడవి శేష్.. తదితరులు ప్రధాన
పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి చిత్రానికి సంగీతం కీరవాణి.

SHARE