Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విడుదల దగ్గర పడుతున్నా కొద్ది ‘బాహుబలి 2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాడు. మునుపెన్నడు ఏ తెలుగు సినిమా కాదు ఏ బాలీవుడ్ సినిమా కూడా విడుదల కానన్ని థియేటర్లలో ‘బాహుబలి 2’ను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ఇక ‘బాహుబలి 2’ మొదటి పది రోజుల పాటు రోజు ఆరు ఆటలు ప్రదర్శించేందుకు అనుమతిని ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. పది రోజుల తర్వాత ఆడినన్ని రోజులు రోజు అయిదు ఆటలను ఏపీలో ప్రదర్శించబోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీతో పోల్చితే కాస్త తగ్గి తెలంగాణ ప్రభుత్వం ‘బాహుబలి’కి మద్దతుగా నిలిచింది.
‘బాహుబలి 2’ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో రోజు అయిదు షోలు వేసేందుకు అనుమతి ఇస్తున్నట్లుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన ‘బాహుబలి’కి ఇది మేము ఇచ్చే గౌరవంగా ఆయన చెప్పుకొచ్చాడు. అయితే నిర్మాతలు ఆరు షోలకు అనుమతి అడిగినప్పటికి అందుకు ఓకే చెప్పలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆరు షోలకు అనుమతిస్తున్నట్లుగా తలసాని ప్రకటించారు. రోజుకు అయిదు షోలతో కూడా ‘బాహుబలి 2’ దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.