Posted [relativedate]
బాహుబలి ఏప్రిల్ 7 న విడుదల కాబోతోంది..ఔను మీరు చదివింది నిజమే.ప్రపంచమంతా ఏప్రిల్ 28 న రిలీజ్ అంటుంటే ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా ?…కానీ నిజంగానే ఏప్రిల్ 7 న సినిమా విడుదలకి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.ఆ లోగుట్టు ఇదేనండి ..
ఏప్రిల్ 28 న బాహుబలి రెండో భాగం విడుదల అవుతుంటే …అంతకు మూడు వారాల ముందుగా బాహుబలి మొదటి పార్ట్ ని ఇంకోసారి రిలీజ్ చేయబోతున్నారు.రెండో పార్ట్ మీద ఆసక్తి పెంచే సన్నాహకాల్లో భాగమే ఇది.బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న మరోసారి ప్రేక్షకుల మదిని ఆక్రమింపచేయడం కోసమే బాహుబలి మొదటి భాగాన్ని మళ్లీ ప్రేక్షకుల మీదకి వదులుతున్నారు.దీని వల్ల కలెక్షన్స్ బోనస్.ఏది ఏమైనా రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీ ని మెచ్చుకోకుండా ఉండలేము కదా ..