బాహుబలి చెప్పింది చేయలేదా?

 bahubali movie release date changeబాహుబలి ది కంక్లూజన్.. ఈ మూవీని 2016లో విడదల చేయబోతున్నట్లు.. మొదటి పార్ట్ చివర్లో టైటిల్ కార్డ్స్ వేసి మరీ చెప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆ విషయంలో మాట తప్పిన జక్కన్న.. 2017 ఏప్రిల్‌లో మాత్రం రిలీజ్ చేయడం గ్యారంటీ అని హింట్ ఇచ్చాడు. తను పైకి అనౌన్స్ చేయకపో యినా.. ఈసారి ఇంటర్నేషనల్ రిలీజ్ ప్లాన్ చేయడంతో.. హిందీతో పాటు ఇతర దేశాల్లోని డ్రిస్టిబ్యూటర్లకు ఈమే రకు సమాచారం ఉంది.

2017 ఏప్రిల్ 14.. బాహుబలి ది కంక్లూజన్‌కు మొదట అను కున్న రిలీజ్ డేట్ ఇది. దీన్ని కొంచెం మా ర్చి ఏప్రిల్ 28కి సెట్ అయ్యారు. సరే.. డేట్ మారినా అదే నెలలో కాబట్టి ఆడి యన్స్ కానీ అభిమా నులు కానీ.. పెద్దగా ఫీల్ అవలేదు. కానీ ఇప్పుడు బాహుబలి సీక్వెల్ ఏప్రిల్ లో విడుదల కావడం కష్టమేనని తెలుస్తోంది. ఇందుకు కారణం.. జక్కన్న పర్ఫెక్షన్ అనే విషయంలో డౌట్స్ అక్కర్లేదు. జూన్ రెండో వారంలో బాహుబలి2 క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభించగా.. ఆగస్ట్ చివరకు పూర్తి చేయాలన్నది అప్పటి ఆలోచన.

కానీ ఇప్పుడు సెప్టెంబర్ చివరి వరకూ క్లైమాక్స్ షూటింగ్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. కొందరు నటులు ఇంకా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉండడం ఒక కారణమైతే.. ఈ మధ్య వరసగా వర్షాలు కూడా షూటింగ్ పై ఎఫెక్ట్ చూపించాయి. ఇలా షూటింగ్‌కే ఒక నెల ఆలస్యం కానుండగా.. వీటికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా మరో నెల రెండు నెలలు లేట్ అయ్యు ఛాన్సుందట. చూస్తుంటే జూన్ చివర్లో కానీ.. జూలై మొదటి వారంలో కానీ బాహుబలి 2 రిలీజ్ కాదేమో. చూద్దాం మేకర్లు ఏమంటారో.

SHARE