బాహుబలి తుఫాను తీరం దాటింది.. ఇక చిన్న జల్లులు షురూ

0
473
Bahubali storm crossed the shore Shower short showers

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Bahubali storm crossed the shore Shower short showers
గత నెల 28న ప్రారంభం అయిన ‘బాహుబలి’ తుఫాను మద్యలో సునామిని తపించి ఏకబికీన మూడు వారాల పాటు కుమ్ముడు కుమ్మింది. బాక్సాఫీస్‌ కూడా బాహుబలి దెబ్బకు గడగడలాడటం జరిగింది అంటే అతిశయోక్తి కాదు. గతంలో ఎప్పుడు లేని కలెక్షన్స్‌ వరదకు ట్రేడ్‌ పండితులు సైతం ముక్కున వేలేసుకున్నారు. బాహుబలి మూడు వారాల పాటు సృష్టించిన కుంభ వృష్టి దాటికి ఏ ఇతర చిరు జల్లులు పని చేయలేక ఆ కుంభవృష్టి దాటికి కనిపించకుండా పోయాయి. మూడు వారాలు గడిచిన తర్వాత నాల్గవ వారంలో బాహుబలి సందడి తగ్గింది. కలెక్షన్స్‌ మందగించాయి.

‘బాహుబలి’ 1500 కోట్ల కలెక్షన్స్‌ సునామి సృష్టించి ఇతర సినిమాలకు ఛాన్స్‌ లేకుండా చేసింది. ‘బాహుబలి’ విడుదలైన తర్వాత ఇప్పటి వరకు ‘బాబు బాగా బిజీ’, ‘రాధ’, ‘వెంకటాపురం’, ‘కేశవ’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ నాలుగు సినిమాలు కూడా బాహుబలి వల్ల తీవ్రంగా నష్టపోయాయి. నాల్గవ వారంలో ‘బాహుబలి 2’ సందడి తగ్గడంతో నాగచైతన్య నటించిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాహుబలి సునామి తగ్గిన నేపథ్యంలో అక్కినేని మూవీ కాస్త సేఫ్‌ జోన్‌లోనే రాబోతుందని విశ్లేషకులు అంటున్నారు. బాహుబలి తర్వాత రాబోతున్న కాస్త పెద్ద సినిమా అవ్వడంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ రావడం ఖాయంగా అనిపిస్తుంది. చైతూ సినిమాతో పాటు ఇక మెల్ల మెల్లగా చిన్న సినిమాలు అన్ని బాక్సాఫీస్‌ వద్దకు క్యూ కట్టబోతున్నాయి.

Leave a Reply