యుద్ధభూమిలో క్రికెట్ ఆడుతున్న బాహుబలి..!

bahubali team playing cricket

తెలుగు సినిమా స్టామినాను దశదిశలల్లా చాటి చెప్పిన బాహుబలి మూవీ ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ జరుపుకుంటుంది. నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ షూటింగ్ కు వర్షం అడ్డుగా మారింది. అందుకే షూటింగ్ క్యాన్సిల్ చేసి ఆ యుద్ధభూమిలో క్రికెట్ ఆడుతున్నారట చిత్రయూనిట్. వర్షం కారణంగా షూటింగ్ ఆగిపోయింది కనీసం క్రికెట్ అన్నా ఆడాలిగా అంటున్నాడు జక్కన్న. మొన్నామధ్య హైదరాబాద్ క్లైమెట్ మొత్తం పగలే అంతా మబ్బు మబ్బుగా ఉంటే పెద్ద పెద్ద లైట్స్ పెట్టిమరి షూటింగ్ కానిచ్చిన రాజమౌళి వర్షానికి మాత్రం షూటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టక తప్పలేదు.

ఇక ఈ వార్ ఎపిసోడ్స్ తర్వాత సెప్టెంబర్లో కొంత టాకీ పార్ట్ షూట్ చేసుకుని సినిమాకు గుమ్మడికాయ కొట్టేస్తారట చిత్రయూనిట్. అసలైతే అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈరోజు కల్లా క్లైమాక్స్ వార్ సీక్వెన్స్ ముంగించాల్సిందట. కాని వర్షం పడటం వల్ల జక్కన్న ప్లాన్ కు అంతరాయం కలిగింది. ఇప్పటికే ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేసిన దర్శక నిర్మాతలు ఆ టైంకు సినిమాను కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

SHARE