ఆ ప్లాప్ సినిమాతో బాహుబలికి చిక్కులు …

0
517

 bahubali team worried about anushka body size
బాహుబలి 2 రిలీజ్ డేట్ కూడా వచ్చింది. ఏప్రిల్ 28 న సినిమా విడుదల చేయాలని దర్శకనిర్మాతల ప్లాన్. అయితే ఈ ప్లాన్స్ కి ఓ ప్లాప్ సినిమా బ్రేకులేస్తోంది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు… అనుష్క నటించిన సైజ్ జీరో… ఆ సబ్జెక్టు మీద మోజుతో ఆమె బాగా లావెక్కింది. హాయిగా తిని కమ్మగా నిద్రపోతే సినిమా కి అవసరమైన షేప్ వచ్చేసింది. అయితే బాహుబలి షూటింగ్ కోసం తగ్గడం మొదలెట్టాక గానీ అమ్మడికి అసలు విషయం అర్ధంకాలేదు. పెరిగినంత తేలిగ్గా తగ్గకపోవడం, డైరెక్టర్ రాజమౌళి ఒత్తిడి మధ్య అనుష్క నలిగిపోతోందంట.

అనుష్క బాధ కన్నా బాహుబలి టీం ఎక్కువ టెన్షన్ పడుతుందంట. దేవసేన క్యారెక్టర్ కి తగ్గేదాకా అనుష్కతో షూటింగ్ ఆపాలని రాజమౌళి నిర్ణయించారు. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ అయన కూడా టెన్షన్ పడుతున్నారంట. హీరో ప్రభాస్ సైతం ఇబ్బంది ఫీల్ అవుతున్న్నారంట. బాహుబలి2 లేట్ అయితే తర్వాత మూవీ షెడ్యూల్ దెబ్బతింటుందని అయన కంగారు. మొత్తానికి సైజ్ జీరో …బాహుబలి టీం ని ముప్పుతిప్పలు పెడుతోంది.

Leave a Reply