త్వరలోనే బాహుబలి వీడియో గేమ్..

  Posted February 10, 2017

టెంపుల్ రన్ వీడియో మాదిరిగా మెగా 150 గేమ్ పేరుతో ఓ వీడియో గేమ్ ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా త్వరలోనే  బాహుబలి వీడియో గేమ్ కూడా రానుంది. ఈ గేమ్ లో ప్లేయర్సే బాహుబలిగా మారిపోయి కాలకేయుడిని చంపవచ్చట. అలాగే భళ్ళాలదేవుడిలా మారి రాజకీయ స్కెచ్ లు కూడా వేయచ్చట. బాహుబలి సినిమా ఆధారంగా ఈ గేమ్ ను రూపొందిచనున్నారని  బాహుబలి చిత్రయూనిట్ తెలిపింది.

బాహుబలి అనే మహావృక్షానికి సినిమా కేవలం ఓ కొమ్మ మాత్రమేనని చెప్పిన రాజమౌళి కామిక్‌ బుక్స్‌, వీఆర్‌ మొదలైన వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే ‘బాహుబలి’ మొబైల్‌ గేమ్‌ ను కూడా విడుదల చేయనున్నారు. ఫామ్‌ విల్లే, లార్డ్‌ ఆఫ్‌ రింగ్స్‌ వంటి పాపులర్ గేమ్స్ ను రూపొందించిన మూన్‌ ఫ్రాగ్‌ ల్యాబ్స్‌ కు చెందిన మార్క్‌ స్కగాస్‌ తో చర్చించారు. ఈ చర్చలకు సంబంధించిన పలు చిత్రాలను ఆర్కా మీడియా అభిమానులతో పంచుకుంది.

కాగా కొందరు  సినీ విమర్శకులు మాత్రం బాహుబలి-2 ని ఎంతగా ప్రమోట్ చెయ్యాలో అన్ని విధాలుగా రాజమౌళి ప్రయత్నిస్తున్నాడని, ఆ ప్రమోషన్ తో పాటు డబ్బులు వచ్చే మార్గం కూడా చూసుకుంటున్నాడని అంటున్నారు. మరి బాహుబలి గేమ్ ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుందో చూడాలి.

SHARE