Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి 2’ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో కన్నడ ప్రజా సంఘాల నాయకులు మాత్రం కర్ణాటకలో విడుదల కానిచ్చేది లేదు అంటూ ఆందోళనలు పెద్ద ఎత్తున చేపట్టారు. వారు అనుకున్నట్లుగా సత్యరాజ్‌తో క్షమాపణలు చెప్పించుకున్నారు. కావేరి జలాల విషయంలో 9 సంవత్సరాల క్రితం సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు. సత్యరాజ్ క్షమాపణలు చెప్పడంతో కన్నడంలో విడుదలకు మార్గం సుగమం అయ్యింది.
కర్ణాటకలో తెలుగు మరియు తమిళ వర్షన్‌లలో విడుదల కాబోతుంది. నిన్న మొన్నటి వరకు విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలున్న ‘బాహుబలి 2’ సినిమా ఏకంగా 750 థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కర్ణాటకలో ఏ సినిమా కూడా ఇంత భారీ స్థాయిలో విడుదలైంది లేదు. కన్నడ సినిమా కూడా ఎప్పుడు ఇంత భారీగా విడుదల కాలేదని ఇదో రికార్డు అంటూ అక్కడ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఇక ‘బాహుబలి 2’ కన్నడ వర్షన్ ట్రైలర్‌ను 60 లక్షల మంది చూడటం కూడా రికార్డుగా చెప్పుకుంటున్నారు. దీంతో పాటు కర్ణాటక ప్రభుత్వం మొదటి సారి ఒక సినిమా టికెట్ల రేట్లను ఏకంగా 250 రూపాయలకు పెంచేందుకు అనుమతి ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. నేడు మంత్రి వర్గ సమావేశంలో ఆ విషయమై నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తానికి కర్ణాటకలో ‘బాహుబలి 2’ సందడి తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. 50 కోట్లను మించి వసూళ్లు అక్కడ సాధిస్తుందనే నమ్మకంతో నిర్మాతలున్నారు.