ఇద్దరికి కుదరట్లేదట..!

424

Posted [relativedate]

bk1216నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్నాడని తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత 101వ సినిమా కూడా చేసేందుకు రంగంలో దిగాడు. కృష్ణవంశీ డైరక్షన్లో రైతు సినిమా చేయాలనుకున్న బాలయ్య తన ఆలోచన మార్చుకోబోతున్నారని టాక్. అలా ఎందుకు అంటే సినిమా కథ విషయంలో కృష్ణవంశీ చేస్తున్న చేంజెస్ కు బాలయ్య అసంతృప్తిగా ఉన్నాడట. అంతేకాదు ఇద్దరి మధ్య ట్యూనింగ్ కుదరట్లేదు అన్నది ఫిల్మ్ నగర్ టాక్.

సినిమా బిగిన్ అవకముందే ఇలా ఉంటే మొదలు పెట్టాకా ఇంకా కష్టం అవుతుందని ముందే డ్రాప్ అవుతున్నాడట బాలయ్య. అయితే ఆకుల శివ రాసిన ఈ రైతు కథ నచ్చితే బాలయ్య వేరే డైరక్టర్ తో అయినా చేసే వీలుంటుంది కాని మొత్తానికి సినిమా కాదనేయడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఈ న్యూస్ వట్టి రూమరేనా లేక నిజంగానే బాలయ్య రైతుని ఆపేశాడా అన్నది తెలియాల్సి ఉంది.

ఈ మధ్యలోనే సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం అమితాబ్ ను కలిశారు బాలయ్య కృష్ణవంశీలు. మరి ఇంతలోనే ఏమైందో ఏమో కాని అసలకే ప్రాజెక్ట్ అటకెక్కింది అంటున్నారు. ఏది ఏమైనా బాలయ్య రైతుగా చూడాలనుకున్న ఫ్యాన్స్ కోరికకు నిరాశే మిగిలేలా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here